టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో జోరు పెంచుతున్నారు. ఇటీవల 'చెన్నై లవ్ స్టోరీ'తో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో.. ఇప్పుడు మరో మూవీతో రెడీ అవుతున్నారు. తన కెరీర్‌లోనే అత్యంత డిఫరెంట్ జానర్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈసారి ప్రేమకథ కాదు.. ఏకంగా పురాణాల ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కనున్న భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ టైటిల్‌ను 'ఇంద్రపుత్ర' మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్ వినగానే సినిమాపై ఆసక్తి పెరిగిపోతోంది. ధర్మం, అధర్మం మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగనుందని తెలుస్తోంది. అంతేకాదు.. కిరణ్ ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా భారీ మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం. కథ విన్న వెంటనే ఈ సినిమా తనను నటుడిగా మరింత సవాల్ చేస్తుందని భావించానని కిరణ్ చెప్పడం.. సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
ఇక 'ఇంద్రపుత్ర'తో శ్రీకాంత్ పుప్పాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో 'కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1'కు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. అయితే 'ఇంద్రపుత్ర'’ ఒక్క సినిమాతో ముగిసిపోదట. మేకర్స్ ప్లాన్ చేస్తున్న భారీ మైథలాజికల్ యూనివర్స్‌కు ఇదే తొలి అధ్యాయంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ కథ నుంచి మరిన్ని పాత్రలు, మరిన్ని కథలు పుట్టుకొచ్చే ఛాన్స్ ఉందన్న టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
ALSO READ : 'ఇక్కడ రూల్స్ నావే'.. పవర్‌ఫుల్ పోలీస్‌గా టబు..
ఇక ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నుంచి రెగ్యులర్ గా ప్రారంభం కానుంది. భారీ విజువల్స్, గ్రాండ్ యాక్షన్, పురాణ నేపథ్యంతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు? కిరణ్ ఏ పాత్రలో కనిపించబోతున్నారు? ఈ పురాణ ప్రపంచంలో అసలు 'ఇంద్రపుత్ర' ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
New Genre - New Beginnings 🙂#KA15 - #INDRAPUTRA#PrernaArora #SrikanthPuppala #Keerthan @zeestudiossouth @ZeeStudios_ #NileshDeorah @girishjohar #AmeetBhuvan #NisheethChandra @RitikeshGorak pic.twitter.com/oBk3Vcp8qK
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 10, 2026
