టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా అంటేనే ఓ ప్రత్యేకమైన మాస్ వైబ్ ఉంటుంది. దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో వస్తున్న 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' మూవీ రెడీ అవుతుంది. ఇప్పుడు చాలా కాలం తర్వాత బాలీవుడ్ బ్యూటీ టబు తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.. ఈ పాన్ ఇండియా మూవీపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లేటెస్ట్ గా టబు పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. టబు క్యారెక్టర్ గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని మరో స్థాయికి తీసుకెళ్లింది.
ఈ గ్లింప్స్‌లో టబు గౌరి హెగ్డే అనే కఠినమైన పోలీస్ అధికారిణిగా కనిపిస్తున్నారు. తప్పు చేస్తే ఎంతటి వ్యక్తినైనా వదిలిపెట్టని ఆఫీసర్‌లా ఆమె బాడీ లాంగ్వేజ్, చూపుల్లోని కఠినత్వం కనిపిస్తోంది. పెద్దగా డైలాగులు లేకపోయినా.. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం 'ఇక్కడ రూల్స్ నావే' అనే ఫీలింగ్‌ను కలిగిస్తోంది. మాస్ యాక్షన్ తో అదరగొట్టేసింది.
►ALSO READ | Nuvvu Nenu: ‘నువ్వు నేను’కు పాతికేళ్లు.. ఓ తరం యువతను ఊపేసిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ
అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ పాత్ర కథలో చాలా కీలకమని మేకర్స్ చెబుతున్నారు. దీంతో టబు పాత్ర హీరో విజయ్ సేతుపతితో ఎలా ఢీకొంటుంది? ఆమె పోలీస్ పాత్ర వెనుక ఉన్న అసలు కథేంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు అభిమానులను ఉంత్కఠలో పడేశాయి. ఇక విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ కూడా ఇదే తొలిసారి. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను జేబీ నారాయణ, పూరి కనెక్ట్స్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
