
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్’.రాధాకృష్ణ దర్శకుడు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించారు.
శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, జెనీలియా కీలకపాత్రలో నటిస్తూ సౌత్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది. కన్నడ స్టార్ డా.రవిచంద్ర ప్రధాన పాత్రలో నటించారు. జులై 18న తెలుగు, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది.
శుక్రవారం (June27న) టీజర్‌ను రిలీజ్ చేశారు. యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువ ఉండటంతో టీజర్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇందులో కాలేజ్ స్టూడెంట్‌గా ఎనర్జిటిక్‌గా కనిపించాడు కిరీటి. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ లైఫ్‌ను జాయ్‌ఫుల్‌గా గడిపేస్తుంటాడు. ‘చదువుకోవడానికి నాలుగేళ్ల టైమ్ ఉంటుంది మేడమ్. కానీ మెమొరీస్‌కు మాత్రం అవకాశాలు చాలా అరుదుగా దొరుకుతాయి’ అని కిరీటి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.
కాలేజ్‌లో శ్రీలీలతో లవ్‌లో పడిన తనకు.. లైఫ్‌లో ఏ లక్ష్యం లేని వ్యక్తిని తాను ఇష్టపడనని చెబుతుంది. అందుకే గోల్ సెట్ చేసుకున్నానని మళ్లీ తన వెంటపడుతుంటాడు. స్టైలిష్ లుక్స్‌లో, మాసివ్ డ్యాన్స్ మూమెంట్స్‌తో కిరీటి ఇంప్రెస్ చేశాడు. ఇలాంటి అల్లరి కుర్రాడు చదువు తర్వాత జాబ్‌లో జాయిన్ అయితే.. అక్కడ ఓ స్ట్రిక్ట్ లేడీ బాస్ కనుసన్నల్లో పనిచేయాల్సి వస్తే ఎలా ఉంటుందనేదే మిగతా కథ అని అర్థమవుతోంది.
►ALSO READ | Kannappa Box Office: కన్నప్ప తొలిరోజు షాకింగ్ వసూళ్లు.. అంచనా ఎంత.. వచ్చింది ఎన్నికోట్లు?
టీజర్ చివరిలో బాస్ పాత్రతో జెనీలియా కనిపించడం ఆసక్తిని పెంచింది. కిరీటి ఫ్రెండ్‌గా వైవా హర్ష చేసిన రోల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, కె.కె.సెంథిల్ కుమార్ విజువల్స్ హైలైట్‌గా నిలిచాయి.