రాయ‌ల్స్‌తో మ్యాచ్‌.. టాస్ గెలిచిన కేకేఆర్‌

రాయ‌ల్స్‌తో మ్యాచ్‌.. టాస్ గెలిచిన కేకేఆర్‌

ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో భాగంగా ఇవాళ  రాజ‌స్థాన్‌, కేకేఆర్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌ుతున్నాయి. ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా రాత్రి 7:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభంకాగా.. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది.  ప్ర‌స్తుత సీజ‌న్‌లో ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డ‌టం ఇది రెండోసారి. తొలి ద‌శ‌లో (ఏప్రిల్ 18) జ‌రిగిన హై స్కోరింగ్‌ మ్యాచ్‌లో కేకేఆర్‌పై రాజ‌స్థాన్ 7 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ప్ర‌స్తుత సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్‌ల్లో ఇరు జ‌ట్ల జ‌యాప‌జయాల రికార్డుల‌ను ప‌రిశీలిస్తే.. రాజ‌స్థాన్ 9 మ్యాచ్‌ల్లో 6 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో ఉండ‌గా, కేకేఆర్ 9 మ్యాచ్‌ల్లో కేవ‌లం మూడే విజ‌యాల‌తో ఆఖ‌రి నుంచి మూడో స్థానంలో నిలిచింది. 

హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..
రాజ‌స్థాన్‌, కేకేఆర్ జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు త‌ల‌ప‌డిన 25 సంద‌ర్భాల్లో కేకేఆర్ 13, రాజ‌స్థాన్ 12 మ్యాచ్‌ల్లో విజ‌యాలు న‌మోదు చేశాయి. వాంఖ‌డే వేదిక‌గా ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ఏకైక మ్యాచ్‌లో రాజ‌స్థాన్‌నే విజ‌యం వ‌రించింది. 

తుది జ‌ట్లు:
రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌: జోస్ బ‌ట్ల‌ర్‌, ప‌డిక్క‌ల్‌, సంజూ శాంస‌న్‌, క‌రుణ్ నాయ‌ర్‌, హెట్మైర్‌, రియాన్ ప‌రాగ్‌, అశ్విన్‌, బౌల్ట్‌, ప్ర‌సిద్ద్‌, చ‌హ‌ల్‌, కుల్దీప్ సేన్‌

కేకేఆర్‌: ఆరోన్ ఫించ్‌, అంకుల్ రాయ్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, నితీశ్ రాణా, బాబా ఇంద్ర‌జిత్‌, రింకూ సింగ్‌, ఆండ్రీ ర‌సెల్‌, సునీల్ న‌రైన్‌, ఉమేశ్ యాద‌వ్‌, టిమ్ సౌథీ, శివ‌మ్ మావి 

SRH నుండి మరో క్రికెటర్ ఫేమస్.. అతని తండ్రి కూరగాయల వ్యాపారి

ఎఫ్ -3 ట్రైలర్ వచ్చేస్తుంది..!

రషీద్ ధమాకా

భగీరథ నీటిలో రొయ్యపిల్ల