భగీరథ నీటిలో రొయ్యపిల్ల

భగీరథ నీటిలో రొయ్యపిల్ల

కొత్తగూడ, వెలుగు: సర్కారు ఇంటింటికి సరఫరా చేస్తున్న మిషన్​ భగీరథ నీటిలో రొయ్యపిల్ల వచ్చింది. మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలం ముస్మీకి చెందిన గట్టి నాగన్న, సుగుణ దంపతులు రోజులాగే ఆదివారం ఉదయం మిషన్​ భగీరథ వాటర్​ బిందెల్లో పట్టుకుంటున్నారు. ఇంతలో నల్లా పైపులో నుంచి రొయ్య పిల్ల పడిందని సుగుణ చెప్పారు. ఈ విషయమై ఏఈ నరేశ్​ను వివరణ కోరగా భగీరథ వాటర్​ పలుసార్లు ప్రాసెస్​ అయ్యి వస్తాయని చెప్పారు. అందులో క్లోరిన్​ కలపడం వల్ల క్రిములు చనిపోతాయన్నారు. కానీ  రొయ్యపిల్ల రావడానికి మాత్రం ఆస్కారమే లేదన్నారు.

 

ఇవి కూడా చదవండి

మందుల ధరలు 10 శాతం పెరిగే అవకాశం!

మైక్రో ఇన్సూరెన్స్ గరీబులకు వరం

వచ్చే ఏడాది నుంచి పల్లె విద్యార్థులకు ఇంటి వద్దకే వర్సిటీలు

మన రక్తంలో మైక్రో ప్లాస్టిక్‌‌!