T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ : రెండు మార్పులతో బరిలోకి..  

T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ : రెండు మార్పులతో బరిలోకి..  

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. మొదట నెదర్సాండ్స్ జట్టు బౌలింగ్ చేయనుంది. టాస్ తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మేము ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నాం.. పిచ్ చాలా మంచిగా ఉంది.. ముందుగా పరుగులు చేసి బౌలర్లపై ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఎలా ఆడాలని అనుకుంటున్నామో.. జట్టులోని ప్రతి ఆటగాడు అలాగే అడుతున్నాడని.. ఈ మ్యాచ్ గెలిచి తీరతామనే ధీమా వ్యక్తం చేశాడు కెప్టెన్ సూర్య. ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవడం ఆనందంగా ఉందన్నాడు సూర్య.

ఈ మ్యాచ్‌కు భారత జట్టులో రెండు మార్పులు జరిగాయి. అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో అవకాశం దక్కింది. అలాగే అక్షర్ పటేల్ కు విశ్రాంతి ఇచ్చి..  అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. వీళ్లిద్దరి రాకతో టీమిండియా మరింత స్ట్రాంగ్ అయ్యింది. 

నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ.. మేము టాస్ గెలిచి ఉంటే మొదట బ్యాటింగ్ చేసేవాళ్లం.. ఈ పిచ్ లో మంచిగా వికెట్లు కూడా తీసుకునేలా కనిపిస్తుంది. మాకు భారతదేశంలో ఆడటం ఎప్పుడూ అద్భుతమైన అనుభవం కలిగిస్తుందన్నాడు. ఈరోజు పూర్తి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాం.. ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నామని తెలిపారు. ఫ్రెడ్ క్లాసెన్ స్థానంలో నోహ్ క్రోస్ తుది జట్టులోకి వచ్చాడని స్కాట్ ఎడ్వర్డ్స్ వెల్లడించాడు.


భారత్ జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా. 

నెదర్లాండ్స్ జట్టు: మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ ( వికెట్ కీపర్/ కెప్టెన్), జాచ్ లయన్-కాచెట్, నోహ్ క్రోస్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్.