క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఒకే ఒక్క న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. అదే ఐపీఎల్ స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ డీల్ రూమర్స్. గత కొన్ని సీజన్లుగా ముంబై జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, హార్దిక్ పాండ్యా ఫ్రాంచైజీని వీడనున్నారనే వార్తలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రేడ్ విండోలో భాగంగా, ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్‌ను సొంతం చేసుకునేందుకు ఐపీఎల్‌లోని రెండు పవర్ పౌస్ జట్లు తీవ్రంగా పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. అందులో మొదటిది ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కాగా, రెండోది కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR). ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్‌ను దక్కించుకోవడానికి సీఎస్‌కే భారీ ప్లేయర్ స్వాప్ డీల్‌ను తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
శివమ్ దూబేతో పాటు మరికొందరు ఆటగాళ్లు లేదా భారీ నగదుతో కూడిన ప్యాకేజీని ముంబైకి ఆఫర్ చేసేందుకు చెన్నై సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు, కేకేఆర్ కూడా కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించే లక్ష్యంతో హార్దిక్ ట్రేడింగ్ రేసులో గట్టి పోటీ ఇస్తోంది.
►ALSO READ | గోల్ కొట్టిన సంబరంలో టన్నెల్లో పడిపోయిన బ్రెజిల్ ఫుట్ బాల్ ప్లేయర్.. వీడియో వైరల్
అయితే, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ ట్రేడింగ్ రూమర్లపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ముంబై ఇండియన్స్ లాంటి అగ్రశ్రేణి ఫ్రాంచైజీ తమ ప్రత్యర్థులైన సీఎస్‌కే లేదా కేకేఆర్‌లను మరింత బలపరిచేందుకు హార్దిక్‌ను సులభంగా వదులుకుంటుందా అనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది. ముంబై మేనేజ్‌మెంట్ ఎలాంటి ప్రతిపాదన లేకుండా ఈ డీల్‌కు ఒప్పుకునే అవకాశం లేదని, కేవలం తమ జట్టుకు సమానమైన లేదా అంతకంటే మెరుగైన ప్రయోజనం చేకూరితేనే ఈ ట్రేడ్ సాధ్యమవుతుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతానికి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ మెగా ట్రేడింగ్ వార్ ఐపీఎల్ వేలానికి ముందే వాతావరణాన్ని వేడెక్కించింది. మరి ఈ ఉత్కంఠ పోరులో హార్దిక్ పాండ్యా భవిష్యత్తు ఎటువైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.
