ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్ : బెల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు భర్తీ.. పూర్తి వివరాలు ఇవే..!

ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్ : బెల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు భర్తీ.. పూర్తి వివరాలు ఇవే..!

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ప్రాజెక్ట్ ఇంజినీర్– I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మార్చి 9.

ఖాళీలు: 12.  ప్రాజెక్ట్ ఇంజినీర్-– I.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో బీఈ/ బి.టెక్./ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి. 
గరిష్ట వయోపరిమితి: 32 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 18.
లాస్ట్ డేట్: మార్చి 09. 
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 85 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులను 1: 5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 15 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.పూర్తి వివరాలకు   bel-india.in వెబ్​సైట్​ను సందర్శించండి.