మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల

మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల

సత్తెనపల్లిలో సంక్రాంతి పండుగ రోజున లక్కీడ్రా నిర్వహించిన కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. దీంతో బుధవారం (ఫిబ్రవరి 18) సాయంత్రం రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. 2023లో సంక్రాంతి పండుగ సమయంలో అంబటి రాంబాబు లక్కీ డ్రా నిర్వహించారని జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ మేరకు గుంటూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్‎లో భాగంగా జైల్లో ఉన్న అంబటి రాంబాబుకు బుధవారం (ఫిబ్రవరి 18) గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. నా ఇంటిపై దాడి చేసి కార్లను ధ్వంసం చేశారు.. నా భార్య, పిల్లలను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. 

తనపై అక్రమ కేసు బనాయించారని.. అయినప్పటికీ భయపడకుండా ఎన్నిరోజులైనా జైల్లోనే ఉందామని వెళ్లానని తెలిపారు. బాధితుడిని లోపల పెట్టి నిందితులను వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోనేందుకు సిద్ధమని.. దేవుడున్నాడు.. ధర్మమే గెలుస్తుందని అన్నారు.