జొన్నగిరి గోల్డ్ మైన్‌ ఇకపై స్వర్ణగిరి గోల్డ్ మైన్.. కర్నూలు జిల్లా బంగారు గానికి పేరు మార్చిన ప్రభుత్వం..

జొన్నగిరి గోల్డ్ మైన్‌ ఇకపై స్వర్ణగిరి గోల్డ్ మైన్.. కర్నూలు జిల్లా బంగారు గానికి పేరు మార్చిన ప్రభుత్వం..

కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ మైన్ పేరును స్వర్ణగిరి గోల్డ్ మైన్ గా అధికారికంగా మార్చింది కూటమి ప్రభుత్వం.ఈ మేరకు గురువారం ( జులై 23 ) ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏర్పాటైన తొలి ప్రైవేట్ బంగారు గనిగా గుర్తింపు పొందింది ఈ గని. భవిష్యత్తులో దేశంలోనే ప్రముఖ బంగారం ఉత్పత్తి కేంద్రంగా ఈ గని ఎదిగే అవకాశం ఉందని భావిస్తోంది ప్రభుత్వం. 

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పరిధిలోని పగిడిరాయి, జొన్నగిరి, ఎర్రగుడి గ్రామాల సరిహద్దులో విస్తరించింది ఉంది ఈ బంగారు గని. మొత్తం 597.820 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గనిలో బంగారంతో పాటు వెండి, రాగి, సీసం, జింక్ వంటి ఇతర ఖనిజాలను కూడా తవ్వుతున్నారు.

బంగారం వెలికితీత కోసం జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం 30 సంవత్సరాల మైనింగ్ లీజును మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది జూన్ లో గనిని సందర్శించిన సీఎం చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన ప్రాసెసింగ్ ప్లాంట్ లో బంగారు ఉత్పత్తి లాంఛనంగా ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏర్పడ్డ తొలి ప్రైవేట్ గని కావడంతో ఈ గనికి జాతీయస్థాయిలో ప్రాధాన్యత ఏర్పడింది.. అందుకే స్వర్ణగిరి అని పేరు పెట్టారు.

స్వర్ణగిరి గోల్డ్ మైన్‌ లో ఓపెన్ పిట్ మైనింగ్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. మూడు దశల క్రషింగ్, బాల్ మిల్ గ్రైండింగ్, నెల్సన్ కాన్సంట్రేటర్ గ్రావిటీ సర్క్యూట్ వంటి ఆధునిక సాంకేతిక విధానాలతో మైనింగ్ చేస్తున్నారు. అంతే కాకుండా సీఐఎల్ లీచింగ్, ఎల్యూషన్, ఎలక్ట్రో విన్నింగ్, డోరే స్మెల్టింగ్ వంటి ఆధునిక ప్రక్రియలతో కూడిన ప్రాసెసింగ్ ప్లాంట్‌ ను కూడా ఏర్పాటు చేశారు.