జగిత్యాల TVVP నిధుల గోల్ మాల్ కేసులో బిగ్ ట్విస్ట్...విచారణ పూర్తి..

జగిత్యాల TVVP నిధుల గోల్ మాల్ కేసులో బిగ్ ట్విస్ట్...విచారణ పూర్తి..

ఇటీవల సంచలనం రేపిన జగిత్యాల జిల్లా TVVPలో రూ.6.90 కోట్ల నిధుల గోల్ మాల్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిధుల దుర్వినియోగానికి సంబంధించి డీటెయిల్ ఎంక్వయిరీ పూర్తయ్యింది. 17 మంది బ్యాంకు ఉద్యోగులు ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఈ కేసులో బ్యాంకర్ల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణకు పూర్తిస్థాయిలో బ్యాంకర్లు సహకరించలేదని అంటున్నారు అధికారులు.

 17 మంది బ్యాంకు ఉద్యోగులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఫోర్జరీ చెక్కులు, అసంపూర్ణ సంతకాలతో చెల్లింపులపై విచారణ జరిపారు అధికారులు. జిల్లా అధికారి సంతకం ఫోర్జరీ అనుమానంతో చెక్కు ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. సస్పెండ్ అయిన యాసిన్ నుంచి రూ.2 కోట్ల నగదు రికవరీ చేసినట్లు తెలిపారు అధికారులు. మిగిలిన రూ.4.90 కోట్ల జాడపై పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 ఈ కేసుకు సంబంధించి బినామీ ఆస్తులు, డిజిటల్ లావాదేవీల కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఈ స్కాంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్రమ ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు ఉద్యోగాలు. అప్పటి జిల్లా అధికారి లావాదేవీల పై సమన్వయం లేకపోవడంతోనే అక్రమ లావాదేవీలు జరిగినట్లు విచారణ లో వెల్లడైందని తెలిపారు పోలీసులు.