రోజూ బయట తినందే జిహ్వచాపల్యం తీరని రోజులు ఇవి. సాదాగా ఉండే ఇంటి వంట కంటే.. కలర్ ఫుల్ గా.. మసాలా దట్టించిన.. ఆయిల్ లో మునిగిన ఐటెమ్స్ అంటే ఎంతో మందికి చచ్చేంత ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్, స్నాక్స్, బేకరీ, స్వీట్స్.. ఇలా ఎంత తిన్నా కోరిక తరగని ఐటమ్స్.. ఇవి ఎంత నోరూరిస్తాయో.. అంతూ అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయని డాక్టర్స్ చెప్తున్నా పట్టించుకోరు. అయితే అనారోగ్య సమస్యల నుంచి సింపుల్ గా ఈమె ఎలా బయటపడిందో చూస్తే ఆశ్చర్యం వేయక మానదు.
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS).. అంటే అధికంగా మేల్ హార్మోన్స్ రిలీజ్ కావడం. ఈ సమస్యతో బాధపడుతున్న ఒక మహిళ తన సమస్య తీరాలంటే.. లైఫ్ స్టైల్ ను మార్చుకోవాలనే.. ఉద్దేశ్యంతో ఒక సాధారణ నిర్ణయం తీసుకుంది. రెండు నెలల పాటు ప్రతి రోజు మధ్యాహ్నం భోజనంలో సలాడ్ తినాలని డిసైడ్ అయ్యింది. ఇది ఎలాంటి కఠిన డైట్ కాదు, కేవలం ఒక చిన్న అలవాటు మాత్రమే. ఫలితం ఆమె ఆశించిన దానికంటే ఎక్కువగా మార్పులు తెచ్చింది.
ఆమె చేసిన సలాడ్ ఇదే..
మొలకెత్తిన పప్పు (స్ప్రౌట్స్)తో కూడిన సలాడ్ – దోసకాయ, టమాటా, కారెట్, ఉల్లిపాయ, క్యాప్సికం, క్వినోవా, అవకాడో, కాయగూరలు, చికపీస్, ఆరెంజ్ ముక్కలు లేదా దానిమ్మ గింజలు
డ్రెస్సింగ్‌గా ఉప్పు, మిరియాలు, నిమ్మరసం లేదా బాల్సమిక్ వెనిగర్.
ప్రోటీన్‌గా గ్రిల్డ్ పన్నీర్ లేదా సోయా జోడించేది. ఇలా చాలా రకాల ఇంగ్రిడియెంట్స్ ఉండటం వల్ల ఒకే సలాడ్ తిని బోర్ కొట్టకుండా చూసుకుంది.
ఏం మార్పులు వచ్చాయి..?
ఆకలి తగ్గింది : ఆహారం గురించి ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం తగ్గింది. స్నాక్స్ తినాలనే కోరిక తగ్గి, భోజనం తర్వాత చాలా సేపు నిండుగా అనిపించేది.
ఎనర్జీ లెవల్స్ పెరిగాయి : మధ్యాహ్నం తర్వాత వచ్చే నిద్ర తగ్గింది.. వర్క్ లో ఉన్నపుడు వచ్చే మత్తు తగ్గి రోజంతా యాక్టివ్‌గా ఉండగలిగింది.
బాడీ టోన్ మారిపోయింది: బరువు తగ్గింది. బాడీ టోన్ చేంజ్ అయ్యింది. బట్టలు కూడా కరెట్టుగా సెట్ అయ్యాయి.
ఆత్మవిశ్వాసం పెరిగింది: ప్రతి రోజు హెల్త్ కోసం బెస్ట్ ఫుడ్ తీసుకుంటున్నాననే భావన ఆమెను మెంటల్ గా స్ట్రాంగ్ చేసింది.
పీసీఓఎస్ లక్షణాల్లో కొంత మెరుగుదల కనిపించిందని, ముఖ్యంగా హిర్సుటిజం సమస్య కొంచెం తగ్గినట్లు అనిపించిందని ఆమె చెప్పింది. అయితే ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలని స్పష్టం చేసింది.
మెయిన్ పాయింట్:
ఈ అలవాటు డైట్‌గా కాకుండా లైఫ్ స్టైల్ గా మారిందని ఆమె చెబుతున్నారు. పిజ్జా, బ్రెడ్స్, బయటి స్నాక్స్, ఖిచిడి వంటివి కూడా అప్పుడప్పుడు తినేది. భయంతో ఆహారాన్ని నిరాకరించకుండా, సమతుల్యంగా ఉండటానికి ఈ ట్రిక్ ఉపయోగపడినట్లు ఆమె చెబుతున్నారు.
ALSO READ : కష్టాల్లోనూ సంతోషంగా ఉండటం ఎలా?
చిన్న చిన్న మార్పులు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తాయని ఈమె ప్రూప్ చేసింది. అయితే ఇది వ్యక్తిగత అనుభవం మాత్రమే. ఆరోగ్య సమస్యలున్నవారు వైద్యులు లేదా న్యూట్రిషనిస్టుల సలహా తీసుకోవాలి.
