Ramayana Trailer Postponed : 'రామాయణ' ట్రైలర్ కు బ్రేక్.. చివరి నిమిషంలో వాయిదాకు అసలు కారణం ఇదేనా?

Ramayana Trailer Postponed : 'రామాయణ' ట్రైలర్ కు బ్రేక్.. చివరి నిమిషంలో వాయిదాకు అసలు కారణం ఇదేనా?

భారతీయ సినీ చరత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణ' (Ramayana).  దర్శకుడు నితీశ్ తివారీ రూపొందిస్తున్న ఈ మైథలాజికల్ విజువల్ స్పెక్టాకిల్‌పై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.  అయితే అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చివరి నిమిషంలో బ్రేక్ పడటంతో ఫ్యాన్స్ లో తీవ్ర నిరాశ నెలకొంది.

చివరి నిమిషంలో బ్రేక్..

ఈ మూవీలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ ,  సీతగా సాయిపల్లవి,  రావణుడిగా యశ్ నటటిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 24న అమెరికాలోని శాన్ డియాగో కామిక్-కాన్ వేదికగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో ట్రైలర్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

అసలు కారణం ఇదేనా?

అయితే ఈ వాయిదా వెనుక ఉన్న కారణం సాధారణం కాదని తెలుస్తోంది.  సోనీ పిక్చర్స్ (Sony Pictures) ఈ చిత్రాన్ని భారత్ మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. భారతదేశంలో మాత్రం ధర్మా ప్రొడక్షన్స్ పంపిణీ బాధ్యతలు చేపట్టనుంది. ఈ భారీ ఒప్పందం పూర్తైన తర్వాతే ట్రైలర్‌ను విడుదల చేసి ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్స్ ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం.

 

భారీ బడ్జెట్ తో.. 

సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది. విజువల్ ఎఫెక్ట్స్‌ను ఆస్కార్ విజేత సంస్థ DNEG అందిస్తుండగా, సంగీతాన్ని ఆస్కార్ విజేత హాన్స్ జిమ్మర్‌తో పాటు ఏ.ఆర్. రెహమాన్ సమకూరుస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవీ దూబే కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

►ALSO READ | CON CITY Review: అర్జున్ దాస్ ‘కాన్ సిటీ’ ఓటీటీ రివ్యూ.. ట్విస్టులతో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్

రిలీజ్ డేట్ ఫిక్స్..

ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయ ఇతిహాసాన్ని హాలీవుడ్ స్థాయిలో ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయాలన్న లక్ష్యంతో  'రామాయణ'పై  రూపుదిద్దుకుంటుంది.  మరి ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ఈ భారతీయ రామాయణం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.