ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హౌతీలు మళ్లీ నౌకలపై దాడులు చేస్తున్నారు.. గతంలో దాడుల చేస్తే భారీ సైనిక చర్యతో సమాధానం ఇచ్చాం.. ఇప్పుడు తాజాగా మరోసారి అరేబియా వాణిజ్య నౌకలపై హౌతీలు దాడులుచేశారు. ఇది కంటిన్యూ అయితే గతంకంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి.. హౌతీలకు ఇరాన్ బాధ్యత వహించాల్సి ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.
నిన్న హార్ముజ్ లో రెండు అరేబియా వాణిజ్య నౌకలపై హౌతీలు దాడి చేసిన తర్వాత ఈ హెచ్చరికలు జారీ చేస్తూ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు ట్రంప్.
ఏడాది క్రితం సముద్ర వాణిజ్య నౌకలకు ఆటంకం కలిగిస్తూ నౌకలపై దాడులు చేసినందుకు హౌతీలపై అమెరికా భారీ సైనిక దాడులు చేసిందని ట్రంప్ గుర్తు చేశారు. ఇరాన్‌తో అమెరికా ఘర్షణల సమయంలో హౌతీలు బాధ్యతాయుతంగా వ్యవహరించారని, అయితే ఇప్పుడు మళ్లీ దాడులు ప్రారంభించారని ట్రంప్ అన్నారు. గత రాత్రి రెండు సౌదీ అరేబియా నౌకలపై కాల్పులు జరిపినట్లు చెప్పారు.
ఇకపై హౌతీలు ఇలాంటి దాడులు కొనసాగిస్తే, దానికి ఇరాన్‌నే పూర్తిగా బాధ్యుడిగా వహించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. హౌతీలు ఇరాన్ మద్దతుతో పనిచేసే సంస్థ అని చెప్పిన ట్రంప్.. మరోసారి దాడులు జరిగితే ఇరాన్‌తో పాటు హౌతీలపై కూడా భీకరదాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటి వరకు హౌతీలు సంయమనంతో ఉన్నరప్పటికీ మళ్లీ దాడులు ప్రారంభించడం తనను నిరాశకు గురిచేసిందని ట్రంప్ తెలిపారు.
