Lionel Messi Retirement: 2026 ఫిఫా వరల్డ్ కప్‌లో 39 ఏళ్ల వయసులోనూ లియోనెల్ మెస్సీ తన అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో ఏకంగా 8 గోల్స్, 4 అసిస్ట్‌లతో అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కానీ అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓటమి పాలవడంతో మెస్సీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్ మెస్సీ పెద్దగా రియాక్ట్ కాలేదు. హెడ్ కోచ్ లియోనెల్ స్కలోని మెస్సీ కోసం జాతీయ జట్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేసినప్పటికీ, తాజాగా అర్జెంటీనా మీడియా మెస్సీ రిటైర్మెంట్ టైమ్‌లైన్‌కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది.
రాబోయే కొన్ని నెలల పాటు జాతీయ జట్టులోనే మెస్సీ:
అర్జెంటీనా మీడియా నివేదికల ప్రకారం, మెస్సీ ఇప్పుడే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు చెప్పడు.. జట్టులో యువ ఆటగాళ్లకు బాధ్యతలు అప్పగించే ( ట్రాన్సిషన్) ప్రక్రియ కోసం రాబోయే కొన్ని నెలల పాటు అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున ఆడాలని అనుకుంటున్నాడు. మరొక వరల్డ్ కప్‌లో బరిలోకి దిగే ఉద్దేశం మెస్సీకి ఎంతమాత్రం లేదని అర్థమైతుంది. త్వరలోనే తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు అధికారికంగా ముగింపు పలకడానికి ఈ లెజెండ్ రెడీ అవుతున్నాడు.
►ALSO READ | భారత్‌లో ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్?.. టాడ్ గ్రీన్‌బర్గ్ కామెంట్స్ వైరల్!
ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహించనున్న అర్జెంటీనా:
దిగ్గజ క్రీడాకారులు సాధారణంగా ఒక సోషల్ మీడియా పోస్ట్ లేదా ప్రెస్ మీట్‌తో రిటైర్మెంట్ ప్రకటించడం చూస్తుంటాం.. కానీ మెస్సీ విషయంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తోంది. మెస్సీ కోసం అర్జెంటీనా మైదానంలోనే ఒక భారీ, హై-ప్రొఫైల్ ఫేర్‌వెల్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫ్యాన్స్ తమ ఆరాధ్య ఫుట్‌బాల్ హీరోకి ఘనంగా వీడ్కోలు చెప్పేందుకు ఈ మ్యాచ్ ఒక అద్భుతమైన వేదిక కానుంది.
మెస్సీ అద్భుత లెగసీ ఇదే:
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో లియోనల్ మెస్సీ ప్రయాణం అనేక మలుపులతో కొనసాగింది. ఆరంభంలో వరుసగా ఫైనళ్లలో ఓడిపోయిన సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మెస్సీ, ఆ తర్వాత అర్జెంటీనాను ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా నడిపించాడు. మెస్సీ కెప్టెన్సీలోనే అర్జెంటీనా 2021 కోపా అమెరికా, 2022 ఫైనలిసిమా, 2022 ఫిఫా వరల్డ్ కప్, 2024 కోపా అమెరికా ట్రోఫీలని అందుకుంది. నంబర్ 10 జెర్సీ హీరో అంతర్జాతీయ వీడ్కోలు కూడా ఆయన కెరీర్‌లాగే అత్యంత అద్భుతంగా, చరిత్రలో నిలిచిపోయేలా ఉండే అవకాశం ఉంది.
"Omo!! Lionel Messi is an alien🤠
— windollar (@Emmanuel1769641) July 23, 2026
This Body feint is from where exactly?? pic.twitter.com/hCJDQCrHQi
