మోడీ... నువ్వు అనవసరంగా Gen-Z తరంతో పెట్టుకున్నవ్..నీ సర్కార్ ను తొక్కుతరు: కేటీఆర్

మోడీ... నువ్వు అనవసరంగా  Gen-Z తరంతో పెట్టుకున్నవ్..నీ సర్కార్ ను తొక్కుతరు: కేటీఆర్

ప్రధాని నరేంద్ర మోడీకి  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.నువ్వు అనవసరంగా Gen-Z తరంతో పెట్టుకున్నావు మోడీ... కాలంతో పాటు తరం మారుతోంది, స్వరం కూడా మారుతోంది... జాగ్రత్తగా ఉండు అంటూ విరుచుకుపడ్డారు.

ఇందిరాపార్క్ దగ్గర నిరసనలో పాల్గొన్న కేటీఆర్..  నేపాల్‌లో యువత తిరగబడితే ఏకంగా ప్రభుత్వమే కూలిపోయిందని గుర్తుచేసిన కేటీఆర్... మన దేశంలోనూ విద్యార్థుల శక్తిని తక్కువగా అంచనా వేయొద్దన్నారు. లడఖ్ ఆందోళనకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను ఈడీ, సీబీఐ భయంతో మీడియా చూపించకపోయినా... నేటి విద్యార్థులు సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకుని ధైర్యంగా పోరాడుతున్నారని కొనియాడారు.

విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసుల జులుం నశించాలని నినాదాలు చేశారు. రేప్ కేసుల్లో బీజేపీ నాయకుల కొడుకులకు వెంటనే బెయిల్ వస్తోంది కానీ, తమకు ఎందుకు న్యాయం జరగడం లేదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని... రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీల్లో ఎవరైనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అని సవాల్ విసిరారు. దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడే బీజేపీకి... ఈ విద్యార్థులు హిందువుల్లా కనిపించడం లేదా అని కేటీఆర్ నిలదీశారు.