అన్నమయ్య జిల్లాలో దారుణం... తల్లికి వందనం డబ్బుల కోసం భార్యను గొంతు కోసి చంపిన భర్త..

అన్నమయ్య జిల్లాలో దారుణం... తల్లికి వందనం డబ్బుల కోసం భార్యను గొంతు కోసి చంపిన భర్త..

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని తంబళ్లపల్లిలో తల్లికి వందనం డబ్బుల కోసం భార్యను గొంతు కోసి  దారుణంగా హత్య చేశాడు భర్త.శుక్రవారం ( జులై 24 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పీటీఎమ్ మండలం రాపూరివారిపల్లి పంచాయితీకి చెందిన కొత్తపల్లి సమీపంలో జరిగింది ఈ ఘటన.

తంబళ్ళపల్లికి చెందిన సురేష్, పద్మావతిలకు ఇద్దరు కొడుకులు. తల్లికి వందనం డబ్బుల విషయంలో పద్మావతితో గొడవపడ్డాడు సురేష్. డబ్బులు ఇవ్వడానికి పద్మావతి నిరాకరించడంతో రెచ్చిపోయిన సురేష్ కిరాతకంగా ఆమె గొంతు కోసి చంపేశాడు. సురేష్ తరచూ డబ్బుల కోసం గొడవపడేవాడని పద్మావతి తల్లిదండ్రులు కళావతి, రామన్న చెబుతున్నారు.

తల్లికి వందనం డబ్బుల కోసం చిత్రహింసలు పెట్టి పద్మావతిని గొంతు కోసి చంపేశాడని తెలిపింది కళావతి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.