తెలంగాణలో ఒంటి పూట బడులు ఎప్పటి నుంచి అంటే..

తెలంగాణలో ఒంటి పూట బడులు ఎప్పటి నుంచి అంటే..

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి ఎండలు పెరిగాయి. మరీ ముఖ్యంగా.. తెలంగాణలో మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దీంతో.. ఒంటి పూట బడులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మార్చి 16, 2026 నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించింది. మార్చి 15న ఆదివారం కావడంతో మార్చి 16 నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ ఒంటి పూట బడులు నిర్వహించాలని విద్యా శాఖ డిసైడ్ అయింది.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం 12.30కు వడ్డించి.. ఆ తర్వాత విద్యార్థులను ఇంటికి పంపించేస్తారు. పదవ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకూ ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు.

మార్నింగ్ సెషన్లో టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇక.. ఎకడమిక్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే.. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకూ సమ్మర్ హాలిడేస్. 2026-27 అకడమిక్ ఇయర్ క్లాసులు జూన్ 12 నుంచి మొదలవుతాయి.