వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా.. తాను ఇప్పట్లో ఇండియాకు రాలేనంటూ ముంబై హైకోర్టుకు తెలిపారు. లండన్ లో కోర్టు ఆదేశాల మేరకు తాను యూకెను వదిలి రాలేకపోతున్నాని చెప్పారు. విదేశాలకు వెళ్లకుండా తనపై యూకెలో ఇంకా చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయి..భారత్ కు తిరిగి ఎప్పుడు వస్తానో తెలియదని కోర్టు కు తెలిపారు.
70 ఏళ్ల ఈ వ్యాపారవేత్త భారత్ లో మోసం ,మనీలాండరింగ్‌కు సంబంధించి అనేక కేసులు ఎదుర్కొంటున్నాడు. 2016 లో యూకేకు పారిపోయిన మాల్యా.. ఈ కేసుల్లో అప్పటినుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా ముంబై హైకోర్టులో ఈ కేసులు హియరింగ్ రాగా.. విజయ్ మాల్యా ఇండియా కు వచ్చి స్వయంగా కోర్టుకు హాజరైతే.. తాను దాఖలు చేసిన పిటిషన్లను విచారిస్తామని తేల్చి చెప్పింది. మాల్యా భారత్ కు తిరిగి వస్తారా లేదా స్పష్టంగా తెలియజేస్తూ ఆఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఏంటీ విజయ్ మాల్యా కేసు..
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ద్వారా 17 బ్యాంకులకు సుమారు రూ.9వేల కోట్లకు పైగా రుణాలు ఎగవేసి, 2016లో లండన్ పారిపోయారు విజయ్ మాల్యా. మనీ లాండరింగ్, విదేశాలకు నిధుల మళ్లింపు, ఉద్దేశపూర్వక డిఫాల్టర్ ఆరోపణలపై CBI, ED లు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
