జగిత్యాల: కోరుట్లలో గత రాత్రి 8 గంటలకు బుర్కా వేసుకొని బస్టాండ్లో ఉన్న వ్యక్తి మహిళల దగ్గర కూర్చుని అనుమానంగా కనిపించాడు. బురఖా వేసుకున్న వ్యక్తి పురుషుడని గుర్తించి బస్టాండ్లోని ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సమాచారం అందించారు. అతనిపై ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది నిఘా పెట్టింది. అతను ఫోన్లో మాట్లాడుతుండగా.. గొంతు మగ వ్యక్తిదిగా నిర్ధారించుకొని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. డిపో మేనేజర్ అతనిని స్థానిక పోలీసులకు అప్పగించారు.
ఏదైనా ప్రాంక్ వీడియో కోసం ఇలా చేశాడా లేదా ఆకతాయి చేష్టలతో అమ్మాయిలు, మహిళల మధ్యలో కూర్చుని ఇలా వారిని ఇబ్బంది పెడుతున్నాడో అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు అతనిని విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం ఇలా మహిళలను ఇబ్బంది పెట్టే చేష్టలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
