ముంబైతో కేకేఆర్ చావో రేవో పోరు.. రహానే సేన ప్లేఆఫ్స్ గండం గట్టెక్కేనా?

ముంబైతో కేకేఆర్ చావో రేవో పోరు.. రహానే సేన ప్లేఆఫ్స్ గండం గట్టెక్కేనా?

KKR vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. లీగ్ దశలో భాగంగా కాసేపట్లో ( 2026, మే 20న) కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) మధ్య చావో రేవో పోరు కొనసాగనుంది. ప్లేఆఫ్స్ రేసు పరంగా కేకేఆర్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన పిచ్ రిపోర్ట్, తుది జట్లు, గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దామా.. 

పిచ్ రిపోర్ట్: 
సాధారణంగా ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఇక్కడి ఔట్‌ఫీల్డ్ చాలా వేగంగా ఉండటంతో బ్యాటర్లు భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంటుంది. కానీ, భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం నేడు కోల్‌కతాలో పిడుగులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం పడితే పిచ్ స్వరూపం పూర్తిగా మారిపోతుంది. తడి ఔట్‌ఫీల్డ్ కారణంగా స్పిన్నర్లకు బంతిపై గ్రిప్ దొరకడం కష్టమవుతుంది. అందువల్ల టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ (ఛేజింగ్) చేసే జట్టుకు భారీ అడ్వాంటేజ్ దొరుకుతుంది. 

గెలిచేది ఎవరంటే?:
ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అద్భుతమైన హోమ్ రికార్డు ఉంది. తమ గత మ్యాచ్‌లో ఇదే వేదికపై గుజరాత్ టైటాన్స్‌ను 29 పరుగుల తేడాతో ఓడించి మంచి ఫామ్‌లోకి వచ్చింది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. కాబట్టి ముంబై కోల్పోయేదేం లేదు, కానీ ప్లేఆఫ్స్ చేరాలంటే కేకేఆర్‌కు ఈ విజయం అత్యంత అవసరం.. దీంతో హోమ్ గ్రౌండ్ సపోర్ట్, పటిష్టమైన ఓపెనింగ్ జోడి, బలమైన స్పిన్ అటాక్ ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ మ్యాచ్‌లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  

►ALSO READ | వింబుల్డన్‌‌కు అల్కరాజ్‌‌ దూరం.. .. ఫిట్నెస్ లేదు.. తప్పుకున్నాడు

ఇరు జట్ల అంచనా: 
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిన్ అలెన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, సునీల్ నరైన్, మనీష్ పాండే, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజారబానీ.
ఇంపాక్ట్ ప్లేయర్స్: వరుణ్ చక్రవర్తి, రోవ్‌మన్ పావెల్.

ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, విల్ జాక్స్, శార్దూల్ ఠాకూర్, రాజ్ అంగద్ బావా, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, అల్లా గజన్‌ఫర్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: రోహిత్ శర్మ, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్.