KL రాహుల్. టీమిండియా క్రికెట్ హిస్టరీలో తనకంటూ కొన్ని పేజీలు తప్పకుండా ఉంటాయి. కానీ.. IPL టోర్నీలో మాత్రం KL రాహుల్ నష్ట జాతకుడిగా మిగిలిపోయాడు. పాపం.. KL రాహుల్ ఎంత కష్టపడినా.. ఎంత అద్భుతంగా రాణించినా.. అతను ఏ టీం తరపున ఆడితే ఆ టీం ఐపీఎల్ కప్ సొంతం చేసుకోకుండానే ఇంటి బాట పట్టిన పరిస్థితి.
KL రాహుల్ 2013 నుంచి ఐపీఎల్ టోర్నీ ఆడుతున్నాడు. 13 సంవత్సరాలుగా కేఎల్ రాహుల్ ఏ టీంలో ఆడినా.. ఆ టీం ఐపీఎల్ కప్ గెలవకుండానే నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించడం KL రాహుల్ దురదృష్టానికి అద్దం పడుతుంది.
KL Rahul's wait continues for a maiden IPL trophy... 💔🏆
— Sportskeeda (@Sportskeeda) May 24, 2026
IPL 2013- RCB ❌
IPL 2014 - SRH ❌
IPL 2015 - SRH ❌
IPL 2016 - RCB ❌
IPL 2017 - ❌
IPL 2018 - PBKS ❌
IPL 2019 - PBKS ❌
IPL 2020 - PBKS ❌
IPL 2021 - PBKS ❌
IPL 2022 - LSG ❌
IPL 2023 - LSG ❌
IPL 2024 - LSG ❌
IPL… pic.twitter.com/iFvIgIyA1C
ఈ 2026 ఐపీఎల్ సీజన్ అయినా.. కలిసొస్తుందనుకుంటే ఈ సీజన్ కూడా రాహుల్కు నిరాశనే మిగిల్చింది. ఈ టోర్నీలో ఢిల్లీ ఆడిన 14 మ్యాచుల్లో ఏడు గెలిచి, ఏడు ఓడిపోయింది. రన్ రేట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, కీలక మ్యాచుల్లో చేతులెత్తేయడంతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించకుండానే ఢిల్లీ నిష్క్రమించక తప్పలేదు. KL రాహుల్ 2013, 2016లో RCB తరపున, 2014, 2015లో SRH తరపున, 2018 నుంచి 2021 వరకూ పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా, 2022 నుంచి 2024 వరకూ లక్నో కెప్టెన్గా, 2025, 2026లో ఢిల్లీ జట్టులో ప్లేయర్గా కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు.
►ALSO READ | హ్యాట్రిక్ మిస్... క్యాచ్ డ్రాప్ చేసిన అభిషేక్ పోరెల్ పై కుల్దీప్ యాదవ్ ఫైర్...
SRH 2016లో ఐపీఎల్ కప్ గెలిచింది. కానీ.. కేఎల్ రాహుల్ ఆ సీజన్లో RCBలో ఉన్నాడు. 2025లో RCB కప్ గెలిచింది. కానీ.. ఈ సీజన్లో కేఎల్ రాహుల్ ఢిల్లీ జట్టులో ఉన్నాడు. లక్నో, ఢిల్లీ జట్లకు ఇప్పటికీ ఐపీఎల్ కప్ కలగానే మిగిలిపోయింది. ఇలా.. KL రాహుల్ టైమేంటో పాపం.. ఐపీఎల్ టోర్నీలో దురదృష్టానికి దగ్గరగా, అదృష్టానికి అగపడనంత దూరంగా ఉంది.
