హ్యాట్రిక్ మిస్... క్యాచ్ డ్రాప్ చేసిన అభిషేక్ పోరెల్ పై కుల్దీప్ యాదవ్ ఫైర్...

హ్యాట్రిక్ మిస్... క్యాచ్ డ్రాప్ చేసిన అభిషేక్ పోరెల్ పై కుల్దీప్ యాదవ్ ఫైర్...

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో కేకేఆర్ కెప్టెన్ రహానే, రింకు సింగ్ ల వికెట్లు వరుసగా తీసిన కుల్దీప్ తేజస్వి దుబియా వికెట్ తో హ్యాట్రిక్ సాదిస్తాడనుకున్న టైంలో క్యాచ్ డ్రాప్ చేశాడు వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్. అంతే... అభిషేక్ పోరెల్ పై ఆగ్రహంతో ఉగిపోయాడు కుల్దీప్. హ్యాట్రిక్ మిస్ అయ్యిందన్న ఫ్రస్టేషన్ లో కీపర్ అభిషేక్ పోరెల్ పై ఫైర్ అయ్యాడు కుల్దీప్.

ఈ సీజన్‌లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కుల్దీప్ యాదవ్‌ను గత కొన్ని మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం చేసింది ఢిల్లీ యాజమాన్యం. అయితే, కేకేఆర్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి మ్యాచ్ లో కుల్దీప్ ను టీంలోకి తీసుకున్నాడు అక్షర్ పటేల్. కుల్దీప్ వరుస బంతుల్లో అజింక్య రహానేను, ఆ తర్వాత రింకు సింగ్‌ను తొలి బంతికే డకౌట్ చేశాడు. హ్యాట్రిక్ బంతికి, తేజస్వి దహియా బ్యాట్ ఎడ్జ్ కి తగిలి వెళ్లిన క్యాచ్ ను మిస్ చేశాడు అభిషేక్ పోరెల్. క్యాచ్ డ్రాప్ చేసిన పోరెల్ పై కుల్దీప్ ఫైర్ అవుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

►ALSO READ | ఇండియా చెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డి మిషన్‌‌‌‌‌‌‌‌గా రోహిత్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌

ఈ ఘటనపై స్పందిస్తూ... ఆటలో ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయని... ఈ మ్యాచ్ లో తన పర్ఫామెన్స్ పట్ల సంతోషంగా ఉన్నానని.. హ్యాట్రిక్ సాధించడం, సాదించకపోవడం ఆటలో భాగమే కానీ... తన పర్ఫామెన్స్ పట్ల సంతృప్తిగా ఉన్నానని అన్నాడు కుల్దీప్.ఐపీఎల్ 2026 లో లాస్ట్ మ్యాచ్ లో గెలుపొంది లీగ్ జర్నీని గ్రాండ్ గా ముగించింది ఢిల్లీ.