ఇండియా చెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డి మిషన్‌‌‌‌‌‌‌‌గా రోహిత్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌

ఇండియా చెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డి మిషన్‌‌‌‌‌‌‌‌గా రోహిత్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా టెన్నిస్ డేవిస్ కప్ జట్టు కెప్టెన్ రోహిత్ రాజ్‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. గ్లాస్గో వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌‌‌‌‌‌‌‌కు ఆయన ఇండియా బృందానికి ‘చెఫ్​ డి మిషన్‌‌‌‌‌‌‌‌’గా నియమితులయ్యారు. డిప్యూటీ చెఫ్‌‌‌‌‌‌‌‌ డి మిషన్‌‌‌‌‌‌‌‌గా రవి బెంగానీ వ్యవహరించనుండగా.. జనరల్ టీమ్ మేనేజర్లుగా వందనా రావు, రాహుల్ స్వామి ప్లేయర్లతో కలిసి ప్రయాణించనున్నారు. 

జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. ఐవోఏ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న రోహిత్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌.. ఏఐటీఏ వైస్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గానూ సేవలు అందిస్తున్నాడు.  క్రీడా పరిపాలనతో పాటు అన్ని క్రీడా సమాఖ్యలతో రోహిత్‌‌‌‌‌‌‌‌కు ఉన్న మంచి సంబంధాలు ఉన్నాయి. పరిపాలనా అనుభవం కారణంగానే ఐవోఏ నాయకత్వం రోహిత్‌‌‌‌‌‌‌‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.