ఒక్క ట్వీట్తో ఫుల్ క్లారిటీ ఇచ్చిన కొండా సురేఖ

ఒక్క ట్వీట్తో ఫుల్ క్లారిటీ ఇచ్చిన కొండా సురేఖ

హైదరాబాద్: నిరీక్షణ ముగిసిందని, త్వరలో బిగ్ అప్డేట్ వస్తుందని కొండా సురేఖ ‘ఎక్స్’లో ట్వీ్ట్ చేసినట్లు వచ్చిన వార్తలను కొండా సురేఖ ఖండించారు. వివిధ సోషల్ మీడియా వేదికల్లో తమ పేరుతో ప్రచారమవుతున్న వార్తలతో గానీ, పోస్టులతో గానీ తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నామని మాజీ మంత్రి కొండా సురేఖ ఆమె అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను కింద జతపరిచామని పోస్ట్లో కొండా సురేఖ ఆమె అధికారిక Instagram, Facebook, Twitter, Youtube ఛానల్ లింక్స్ను జత చేశారు. మీడియా మిత్రులు మరియు ప్రజలు కేవలం ఈ అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు.

పార్టీ లైన్ దాటిన ఇద్దరు ముఖ్యనేతలపై కాంగ్రెస్ అధినాయకత్వం కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డిపై వేటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించింది.

ALSO READ : సోనియా గాంధీ ఆత్మకథకు లైన్ క్లియర్.. నవంబర్ 10న రిలీజ్

ఈ క్రమంలో కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సిఫార్సు చేయగా ఆయన ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, ఆమె వ్యక్తిగతమంటూ కొండా సురేఖ వివరణ ఇచ్చారు.