సోనియా గాంధీ ఆత్మకథకు లైన్ క్లియర్.. నవంబర్ 10న రిలీజ్

సోనియా గాంధీ ఆత్మకథకు లైన్ క్లియర్.. నవంబర్ 10న రిలీజ్

కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆత్మకథ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఆమె ఆత్మకథ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్.. అనే పుస్తకాన్ని ప్రచురించేందుకు హార్పర్ కోలిన్స్ ఇండియా ముందుకు వచ్చింది. 2026 నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు సెప్టెంబర్ 4 (శుక్రవారం) ప్రకటించింది. 

ఈ పుస్తకం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ బుక్ పై వివాదం నెలకొన్న వేళ పెంగ్విన్ పబ్లిషర్స్ విడుదల నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. అయితే లేటెస్టుగా సోనియా గాంధీ మెమోయిర్, Belonging: A Journey of Love ను నవంబర్ లో పబ్లిష్ చేయనున్నట్లు ప్రకటించింది. 

ఇటలీ యుద్ధం తర్వాత... చిన్న నాటి జీవితం.. ఆ తర్వాత ఇండియాలో ఆమె జీవితం, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో వివాహం, భారత్ లో దశాబ్దాలుగా ఆమె రాజకీయ జీవితం మొదలైన అంశాలను ఈ మెమోయిర్ లో ప్రస్థావించారు. 

మన కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజకీయ జ్ఞాపకాలలో ఒకటి.. అని పబ్లిషర్స్ హార్పర్ కొలిన్స్ పేర్కొన్నారు.  

పెంగ్విన్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురించకూడదు అని నిర్ణయించుకున్న తర్వాత హార్పర్ కొలిన్స్ ఈ నిర్ణయం ప్రకటించడం విశేషం. అయితే ఈ పుస్తకంలో కొన్ని మారపులు చేర్పులు చేయాల్సిందిగా పబ్లిషర్స్ కోరినప్పటికీ.. సోనియా గాంధీ టీమ్ అంగీకరించలేదని తెలుస్తోంది. 

అమెరికాకు చెందిన పెంగ్విన్ రాండమ్ హౌస్ అనుబంధ సంస్థ అయిన ఆల్ఫ్రెడ్ ఎ నాఫ్, ఈ పుస్తకాన్ని నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత  ఈ పుస్తకాన్ని తాము ప్రచురించడం లేదని  పెంగ్విన్ ఇండియా ప్రకటించింది. 

ALSO READ : నూడుల్స్ వేస్టేజ్తో భుజియా తయారీ.. ప్రముఖ కంపెనీ బ్రాండ్స్ సీజ్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ (RSS) , భారత్-చైనా సంబంధాలకు సంబంధించిన అంశాలను తొలగించాలని పెంగ్విన్ ఇండియా కోరిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడంతో ఈ రాజకీయ వివాదం తలెత్తింది. పెంగ్విన్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం ఒత్తిడి కారణంగానే జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.