
కుబేర బాక్సాఫీస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిలీజైన 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.80కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మూడోరోజైన ఆదివారం (జూన్ 22) ఇండియాలోనే రూ.19 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టి.. మూడ్రోజుల్లో రూ.49 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ అందుకుంది. ఆదివారం నాడు కుబేర తెలుగులో 70.56 శాతం ఆక్యుపెన్సీ సాధించగా, తమిళంలో 34.18 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. హిందీ వెర్షన్లో 18.80 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
ట్రేడింగ్ వెబ్ సైట్ Sacnilk.com ప్రకారం, కుబేర మూవీ రెండు రోజుల్లో (శుక్రవారం, శనివారం) ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రూ. 55 కోట్లు, ఓవర్సీస్లో రూ.18.36 కోట్లు రాబట్టింది. మూడో రోజైన ఆదివారం తెలుగులో రూ.12.4 కోట్లు, తమిళంలో 4.5 కోట్లు వసూలు చేసింది.
ALSO READ | Chiranjeevi: ధనుష్ మాత్రమే బిచ్చగాడి పాత్ర చేయగలడు.. నేషనల్ అవార్డ్ రాకపోతే అర్ధం లేదు
మొత్తం ఇండియా వైడ్‌గా తెలుగు వసూళ్లు కలిపి రూ.34 కోట్ల నెట్ సాధించింది. తమిళంలో మాత్రం రూ.13.65 కోట్లు వచ్చాయి. ఈ క్రమంలో మూడు రోజుల వసూళ్లు కలిపి కేవలం నైజాం నుంచే రూ.9.5 కోట్లు రావడం విశేషం. ధనుష్ చివరి రెండు సినిమాలైన రాయన్ మరియు కెప్టెన్ మిల్లర్ కంటే కుబేరానే ముందుంది.
ధనుష్ నటించిన బిచ్చగాడి పాత్రకు సోషల్ మీడియాలో అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. రష్మిక మరియు నాగార్జున స్క్రిప్ట్‌ల ఎంపికకు ప్రేక్షకులు కూడా ప్రశంసలు కురిపించారు. శేఖర్ కమ్ముల ఆకట్టుకునే కథ మరియు భావోద్వేగ సన్నివేశాలు సినిమాను నడిపిస్తున్నాయి. అంతేకాకుండా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది.
కొన్నాళ్లుగా టాలీవుడ్ బాక్సాఫీస్‌కు సరైన హిట్స్ లేవు. ఒక సినిమా సక్సెస్ అయితే, మరోటి ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. ఇక వసూళ్ల పరంగా ఐతే చెప్పేదేలేదు. టాక్ మంచిగా ఉన్నప్పటికీ వసూళ్లలో సరైన ప్రభావం చూపలేకపోతున్నాయి. ఇలా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఇండస్ట్రీకి కుబేర కొత్త ఊపిరిలూదింది.