మద్యం మత్తులో హల్చల్ చేసిన సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య

మద్యం మత్తులో హల్చల్ చేసిన సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా మల్లెపల్లి గ్రామంలో సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య రోడ్డుపై మద్యం మత్తులో హల్చల్ చేసింది. మత్తులో కారు డ్రైవింగ్ చేస్తూ బైక్ ను ఢీకొట్టి పారిపోతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. 

బుధవారం (మార్చి 25) మల్లెపల్లి దగ్గర బైకును ఢీకొట్టి ఆపకుండా పారిపోయే ప్రతయ్నం చేయడంతో లావణ్యను గ్రామస్తులు అడ్డుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. టెస్టు పాజిటివ్ రావడంతో లావణ్యపై కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్కి తరలించారు.

►ALSO READ | ట్రోలర్లకు హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' వసూళ్లపై క్లారిటీ!