మెగా కోడలు మరోసారి వార్తల్లో నిలిచిరు. వరుణ్ తేజ్ సతీమణి, నటి లావణ్య త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు చేశారు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య త్రిపాఠి, తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తాను కూడా ఒకానొక సమయంలో 'కాస్టింగ్ కౌచ్' వేధింపులకు గురయ్యానని, ఒక దర్శకుడి ప్రవర్తన వల్ల ఎంతో మానసిక వేదనను అనుభవించానని ఆమె వెల్లడించారు. సినిమా రంగంలో మెరుపులు ఎంత ఉంటాయో, తెర వెనుక చీకటి కోణాలు కూడా అంతే ఉంటాయన్నారు.
దర్శకుడి తీరుతో....
లావణ్య మాట్లాడుతూ.. "చాలా ఏళ్ల క్రితం నేను ఒక తమిళ సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఆ సినిమా దర్శకుడి తీరు నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆయన ప్రవర్తన వల్ల నేను తీవ్ర అసౌకర్యానికిగురయ్యాను. ఏదో తప్పు జరుగుతోందని నా మనసుకు అనిపించింది. నా ఆత్మగౌరవాన్ని వదులుకోలేక, వెంటనే ఆ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు చెప్పి 'నో' అనేశాను" అని వివరించారు.
టార్గెట్ చేసి వేధించారు!
కేవలం సినిమాకు నో చెప్పడమే కాకుండా, ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను లావణ్య తెలిపారు. నేను ఆ సినిమా వదులుకున్న తర్వాత వారు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. నాపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా, మీడియాలో నా క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించారు. ఆ సమయంలో నాకు సపోర్ట్ చేసేవారు ఎవరూ లేరు. ఏం చేయాలో తెలియక గదిలో కూర్చుని ఏడ్చిన రోజులు ఉన్నాయి అంటూ లావణ్య తన ఆవేదనను వ్యక్తం చేశారు.
►ALSO READ | గోటీల వ్యాపారం.. నెలకు కోట్లు! వైరల్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రాజశేఖర్!
సోషల్ మీడియాలో వేధింపులు..
గత కొంతకాలంగా ‘పర్పుల్ క్రెయాన్00’ (Purple Crayon00) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు పెడుతున్నట్లు ఇటీవల లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది తన మానసిక ప్రశాంతతను దెబ్బతీయడమే కాకుండా, తన కుటుంబ గౌరవానికి కూడా ముప్పు కలిగిస్తోందని లావణ్య తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధింత ఇన్ స్టా ఖాతాదారుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆ ఖాతా ద్వారా చేసిన పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె కోరారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో లావణ్య చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా, ఆమె ధైర్యాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కేవలం అందం, అభినయమే కాదు.. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొనే గుండె నిబ్బరం కూడా ఉండాలని లావణ్య నిరూపించారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'సతీ లీలావతి' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఈ సినిమా మార్చి 6, 2026న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని ప్రకటించనుంది.
“There was a time when I was supposed to do a Tamil film, but I felt something was not right with the DIRECTOR and I didn't feel Comfortable, so I said NO.
— Whynot Cinemas (@whynotcinemass_) March 14, 2026
After that, they were started putting wrong articles about me in newspaper."
– Actress #LavanyaTripathi | #Kollywood pic.twitter.com/QvEZ39watH
