Solar Ecilipse:వందేళ్ల తరువాత సంపూర్ణ సూర్యగ్రహణం..ఎంతసేపు కనపడుతుంది.. డేట్ అండ్ టైం వివరాలు ఇవే..!

Solar Ecilipse:వందేళ్ల తరువాత సంపూర్ణ సూర్యగ్రహణం..ఎంతసేపు కనపడుతుంది.. డేట్ అండ్ టైం వివరాలు ఇవే..!

ప్రపంచవ్యాప్తంగా చారిత్రకరోజు ఈ శతాబ్దంలో రానుంది.  వందేళ్లలో ఎప్పుడూ చూడని వింత ఖగోళంలో ఆవిష్కృతం కానుంది.  2027 ఆగస్టు 2 వ తేదీన పెద్ద సూర్యగ్రహణం సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  ఎంతటైం ఉంటుంది.. ఏ సమయంలో కనపడుతుంది.. ఏఏ దేశాల్లో  కనపడుతుంది మొదలగు విషయాలను ఈస్టోరీలో తెలుసుకుందాం.. ! 

ఈ శతాబ్దంలో అతిపెద్ద పూర్తి సూర్యగ్రహణం 2027 ఆగస్టు 2 న రాబోతుంది.  ఇది అరుదైన, మరపురాని సంఘటన అవుతుంది. రాత్రి వలెనే పగటి సమయంలో కొన్ని ప్రాంతాలు చిమ్మ చీకటిని కమ్ముకుంటాయి.

 ఇది సుమారు 6 నిమిషాల 23 సెకన్ల పాటు కొనసాగే ఒక అరుదైన ఖగోళ సంఘటన. జీవితంలో ఒక్కసారి మాత్రమే వీక్షించగల అద్భుతమైన దృశ్యం ఇది. సూర్యుడు మరియు భూమి మధ్య చంద్రుడు ప్రవేశించినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది, దీనివల్ల భూమిపై కొన్ని ప్రాంతాలలో సూర్యకాంతి క్షణకాలం పాటు అడ్డుకుంటుంది.

 సంపూర్ణ  సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది

ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రధానంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, కొన్ని యూరోపియన్ దేశాలలో కనిపిస్తుంది. ఈజిప్టులోని లక్సోర్ నగరం ఈ గ్రహణానికి ప్రధాన పరిశీలనా ప్రదేశంగా ఉండనుంది. ఇక్కడ సూర్యగ్రహణం ఎక్కువ సమయం కనిపిస్తుంది. దీనితో పాటు స్పెయిన్, మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, సూడాన్, సౌదీ అరేబియా, యెమెన్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. అయితే ఈ సూర్య గ్రహణం ప్రభావం మన దేశంలో భారతదేశంలో, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లో పాక్షికంగా ఉండనుంది. అంటే భారత దేశంలో పాక్షికంగా సూర్యగ్రహణం చూడవచ్చు, ఇక్కడ సూర్యుడిలో కొంత భాగం కప్పబడి ఉంటుంది.

ALSO READ : ఈ తేదీలు, అంకెల్లో పుట్టిన మహిళలు వ్యాపారంలో రాణిస్తూ..

2026 ఆగస్టులో కంకణాకార సూర్యగ్రహణం

ఇక ఈ ఏడాది (2026)  విషయానికి వస్తే ఇప్పటికే ఫిబ్రవరిలో సూర్యగ్రహణం ఏర్పడింది.  రెండో సూర్యగ్రహణం ఆగస్ట్​ 12న కంకణాకార సూర్యగ్రహణం కనబడుతుందని శాస్త్రవేత్తలుచెబుతున్నారు. 
చంద్రుడు సూర్యుని కేంద్రాన్ని అడ్డుకున్నప్పుడు కంకణాకార సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఆరోజు సూర్యుడు చుట్టూ  చంద్రుడు  అగ్ని వలయాన్ని ఏర్పరస్తాడు 

కంకణాకార సూర్యగ్రహణం సమయం ఇదే..!

భారత ప్రామాణిక సమయం ప్రకారం ఈ గ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి సంభవిస్తుంది. గ్రహణం పాక్షిక దశ రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై ఉదయం 4:25 గంటలకు ముగుస్తుంది. సూర్యగ్రహణం ప్రధాన దశ 6 నిమిషాల 23 సెకన్ల పాటు ఉంటుంది. అందువల్ల, ఈ గ్రహణాన్ని సుదీర్ఘకాల సూర్యగ్రహణంగా పరిగణిస్తారు.

2026  రెండో సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా

సూర్యగ్రహణం సంభవించే సమయంలో భారతదేశంలో రాత్రి సమయం కావడం వల్ల దానిని ఇక్కడ చూడటం అసాధ్యం, గ్రహణం  సూతకాలం ఇక్కడ వర్తించదు..ఆగస్టు 12న సంభవించే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల, భారతీయులు ఆకాశంలో అగ్నివలయం అనే అరుదైన దృశ్యాన్ని వీక్షించలేరు.  ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం గ్రీన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్, స్పెయిన్ , ఆర్కిటిక్ ప్రాంతంలోని దేశాలలో కనిపిస్తుంది.