ఆన్ లైన్ లో అమ్మకానికి లవ్ అగ్రిమెంట్.. ధరెంతంటే..

ఆన్ లైన్ లో అమ్మకానికి లవ్ అగ్రిమెంట్.. ధరెంతంటే..

వెరీ వెరీ టూమచ్ అనుకోవచ్చు.. ఇది పచ్చి నిజం.. లవ్ అగ్రిమెంట్.. మొదట ఏడు తరాలు చూసి పెళ్లిళ్లు చేసుకునే వారు.. ఆ తర్వాత తల్లిదండ్రులు చూపించినోళ్లను చేసుకునే వారు.. ఆ తర్వాత లవ్ మ్యారేజ్.. ఆ తర్వాత మతాంతర, కులాంతర పెళ్లిళ్లు.. మొన్నటి వరకు ఆన్ లైన్ పెళ్లి సంబంధాలు.. నిన్నటి వరకు లివింగ్ టూగెదర్.. ఇప్పుడు లవ్ అగ్రిమెంట్స్.. కాలం కంటే అత్యంత వేగంగా మారుతున్న అభిప్రాయాలు, ఆలోచనలకు పరాకాష్ఠ ఈ లవ్ అగ్రిమెంట్. ఇది ఇప్పుడు ఆన్ లైన్ లో అమ్మకానికి ఉంది. డిస్కౌంట్ పై కేవలం 62 రూపాయలకే ఈ అగ్రిమెంట్ లభిస్తుంది.. ఇంతకీ ఈ లవ్ అగ్రిమెంట్ లో ఏముందో తెలుసుకుందామా..

ఈ కింది నియమాలకు కట్టుబడి ఉంటాను అనే క్యాప్షన్ తో ఈ అగ్రిమెంట్ ప్రారంభమవుతుంది:

  • జీవితాతం నీ పట్ల నిజాయితీగా, విశ్వాసపాత్రుడిగా, ప్రేమగల భాగస్వామిగా ఉంటాను.
  • నీకు అద్భుతమైన, సాహసోపేత ప్రేమికుడిగా ఉంటాను.
  • చీకటిలో నీకు మార్గనిర్దేశం చేసే వెలుగుగా, చలిలో ఓదార్పునిచ్చే వెచ్చదనంగా, నీ జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేందుకు తోడుగా.. ఎప్పుడూ మీ వెంట ఉంటాను.
  • జీవితంలో ఎన్ని అడ్డంకులు, సవాళ్లు వచ్చినా.. ఎక్కడున్నా, ఎటువంటి సందర్భంలోనైనా నీతో కలిసే నడుస్తాను.
  • నీ చుట్టూ నా కలలను నిర్మించడానికి, వాటిని నిజం చేయడానికి ప్రయత్నిస్తాను.
  • నీవేమైనా పొరపాట్లు చేస్తే భుజం తట్టి ముందుకెళతాను. ప్రతిరోజూ నీతో ప్రేమలో పడతాను.
  • నీతో హృదయపూర్వకంగా ఉంటాను. నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను.
  • నీతో, నీ కోసం, ఎల్లప్పుడూ ఉంటాను.
  • నా జీవితాంతం ఈ నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా అంగీకరిస్తున్నాను.

వీటితో పాటు అగ్రిమెంట్ కింది భాగంలో ఓ వైపు ఒకరి సంతకం, మరొక వైపు మరొకరి సంతకం చేసేలా రూపొందించారు. ఇవే కాదు ఇదే తరహాలో పలు ఈ కామర్స్ వెబ్ సైట్లలో లవ్ అగ్రిమెంట్ల పేరుతో భిన్న ధరలలో లభిస్తున్నాయి. మరో 10రోజుల తర్వాత వాలెంటైన్ వీక్ స్టార్ట్ కాబోతోంది. ఈ క్రమంలో ఇలాంటి అగ్రిమెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీక్కూడా ఇది ఆసక్తిని కలిగిస్తే, నమ్మితే వెంటనే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలితో ఇప్పుడే ఈ ఒప్పందం చేసుకోండి మరి.