Saipallavi: సాయిప‌ల్ల‌వి రాసిన మొదటి ప్రేమలేఖ!

Saipallavi: సాయిప‌ల్ల‌వి రాసిన మొదటి ప్రేమలేఖ!

ఫిదా సినిమాతో బాన్సువాడ భానుమతిగా సందడి చేసిన​అల్లరి పిల్ల సాయిపల్లవి(Saipallavi)కి ఓ లవ్  స్టోరీ ఉందండోయ్.. ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ కి వ‌య‌సుతో సంబంధం లేదు. ఇంతకూ ఈ అమ్మడు లవ్ లెటర్ ఎప్పుడు రాసిందనుకుంటున్నారు. సరిగ్గా ఏడో తరగతి చదవే టైంలోనట. 

తన మొదటి, చివరి ప్రేమలేఖ గురుంచి సాయిపల్లవి ఏమన్నదంటే.. ‘నేను రాసుకున్న ప్రేమ‌లేఖ ఇప్ప‌టికీ గుర్తుంది. అదే నా చివ‌రి ప్రేమ‌లేఖ కూడా అనుకోండి. అప్పుడు నేను ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాను. ఆ వ‌య‌సులో స్కూల్లో ఓ అబ్బాయి బాగా న‌చ్చాడు. ఆ విష‌యాన్ని అత‌డికి ఎలా చెప్పాలో తెలియ‌క ల‌వ్ లెటర్ రాశాను. కానీ ఆ లెట‌ర్ ఆ అబ్బాయికి ఇచ్చే ధైర్యం నాలో లేదు. అందుకే ఇవ్వలేక పోయాను. ఇంట్లోనే ఉండిపోయింది. ఓ రోజు ఆ లెట‌ర్ ఇంట్లో వాళ్లు చూశారు. బాగా తిట్టారు.. కొట్టారు. దీంతో మ‌ళ్లీ అలాంటి లెట‌ర్ల జోలికి వెళ్ల‌డం మానేశాను. ఆ తిట్లు..దెబ్బ‌లు ఇంకా బాగా గుర్తున్నాయి.

Also Read : రకుల్‌ మ్యారేజ్ డేట్ ఫిక్స్..కలర్ ఫుల్ వెడ్డింగ్ కార్డు వైరల్

ఆ వ‌య‌సులో అలాంటి లేఖ ఎలా రాయ‌గ‌లిగాను అని ఇప్ప‌టికీ ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడా సంఘ‌ట‌న త‌లుచుకుంటే న‌వ్వొస్తుంది. ఆ ప‌నిచేసింది నేనేనా? అని ఆశ్చ‌ర్యంగా కలుగుతుంది. జీవితంలో గుర్తుంచుకునే సంఘ‌ట‌న‌లు ఇలాంటి మెమోరీసే అనిపిస్తుంది’ అని తెలిపింది.