
మా ఊరి పొలిమేర(Maa oori Polimera).. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజై భారీ విజయాన్ని అందుకున్న సినిమా. సత్యం రాజేష్(Sathyam rajesh), బాలాదిత్య(Baladithya), గెటప్ శ్రీను(Getup srinu) ప్రధాన పాత్రలో అనిల్ విశ్వనాథ్(Anil Vishwanath) తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ వెన్నులో వణుకుపుట్టించింది. చేతబడి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులకైతే ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది.
Also Read : సంపత్ నందితో సాయి ధరమ్ నెక్స్ట్ మూవీ.. మెడపై త్రిశూలంతో అదిరిపోయిన మాస్ పోస్టర్
అప్పటి నుండి ఈ సినిమా సీక్వెల్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ మధ్య రిలీజైన ఏ పెద్ద సినిమాకు కూడా ఈ రేంజ్ బజ్ క్రియేట్ అవలేదు అనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇక తాజాగా పొలిమేర సీక్వెల్ పొలిమేర 2 ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ చాలా గ్రిప్పింగ్ గా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక ఇందులో కూడా మొదటి పార్ట్ లాగే చేతబడి కాన్సెప్ట్ ను రిపీట్ చేశారు దర్శకుడు. దానికి సంబందించిన సీన్స్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ను మించి ఈ సినిమా కోసం ఖర్చు చేశారు మేకర్స్. అందుకే విజువల్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. సీన్స్ కూడా సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇలా చాలా అంశాల్లో సినిమాపై అంచనాలు పెంచేసింది ఈ ట్రైలర్.
ఇక పొలిమేర2 నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమాలో కూడా సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. గెటప్ శ్రీను, రాకేందు మౌళి, రవి శంకర్ ఇలా చాలా మదిని ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి పొలిమేర 2 కూడా ఫస్ట్ పార్ట్ లాగ మంచి విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాలి.