Singha Glimpse : కళ్లల్లో రగులుతున్న క్రోధం.. చేతిలో గొడ్డలి.. 'సింగ' లుక్‌లో గోపిచంద్ ఊరమాస్ విధ్వంసం!

Singha Glimpse : కళ్లల్లో రగులుతున్న క్రోధం.. చేతిలో గొడ్డలి.. 'సింగ' లుక్‌లో గోపిచంద్ ఊరమాస్ విధ్వంసం!

మ్యాచో స్టార్ గోపిచంద్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఊరమాస్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌  'సింగ' (Singha)తో రెడీ అయ్యారు. ఈ సినిమాకు ప్రముఖ స్టంట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే  'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'భారతవర్ష: సాగా ఆఫ్ శూల' వంటి భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్ ను చేస్తున్న  గోపిచంద్.. బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి మరో మూవీతో సిద్ధం అయ్యారు.

లేటెస్ట్ గా గోపిచంద్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ విజువల్స్ అండ్ సౌండ్ డిజైన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. పక్షుల కిలకిల రావాలు, గిరిజన తెగల నేపథ్య సంగీతంతో అడవి వాతావరణాన్ని తలపిస్తూ.. నడిరాత్రి వేళ చీకట్లో రెండు కళ్లు మెరుస్తూ కనిపిస్తాయి. చూడ్డానికి ఒక క్రూరమైన చిరుతపులి (Panther) వేటకోసం పొంచి ఉన్నట్లు అనిపిస్తుంది. సరిగ్గా అదే టైమ్‌లో గొడ్డలి పట్టుకుని, కళ్లల్లో రగులుతున్న కోపంతో, ఊచకోత కోయడానికి రెడీ అయిన వేటగాడిలా గోపిచంద్ ఎంట్రీ ఇస్తారు. ఈ క్రేజీ గ్లింప్స్‌తో సినిమా టైటిల్ 'సింగ' (Singha) అని అనౌన్స్ చేశారు.

►ALSO READ | Chinmayi : ఆ 'మోలెస్టర్'కు రెడ్ కార్పెట్టా? సీఎం విజయ్, ఉదయనిధి స్టాలిన్‌లపై చిన్మయి ఫైర్

ఈ గ్లింప్స్‌లో గోపిచంద్ రగ్గడ్ లుక్, విద్వంసం సృష్టించేలా ఉన్న ఆయన మేనరిజం మాస్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.. స్టంట్ మాస్టర్ వెంకట్.. గోపిచంద్‌లోని బెస్ట్ యాక్షన్ యాంగిల్‌ను ప్రెజెంట్ చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో మలయాళీ ముద్దుగుమ్మ అనార్కలీ నాజర్ టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.  వైవిధ్యమైన, ఇంపాక్ట్‌ఫుల్ కథలను అందిస్తూ క్రేజీ ప్రొడక్షన్ హౌస్‌గా పేరు తెచ్చుకున్న 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక 'విక్రమ్ వేద' ఫేమ్ శామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, శ్యామ్‌దత్ అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాకి మేజర్ అసెట్ కానున్నాయి. మొత్తానికి 'సింగ' టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలను మరింత  పెంచేసింది. ఇప్పటికే  'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'భారతవర్ష: సాగా ఆఫ్ శూల' వంటి భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు గోపిచంద్. ఇప్పుడు మరో సాలిడ్ కమర్షియల్ మూవీతో రెడీ అయ్యారు.