చిన్న సినిమా కుమ్మేసింది.. మ్యాడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ సూపర్

చిన్న సినిమా కుమ్మేసింది.. మ్యాడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ సూపర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) బావమరిది నార్నే నితిన్(Narne nithin) హీరోగా పరిచయమైన మూవీ మ్యాడ్(Mad). కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్(Kalyan shankar) తెరకెక్కించిన ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్(Sitara entertainments), ఫార్చున్ ఫోర్ ఫిలిమ్స్(Fortune four films) సంయుక్తంగా నిర్మించాయి. అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఆడియన్స్ నుండి కూడా ఈ సినిమాను పాజిటీవ్ టాక్ వచ్చింది. దీంతో మొదటిరోజు బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. అంతా కొత్తవాళ్లతో కేవలం రూ. 2 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. తొలి రోజే రూ. 1.8 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లెక్కన రానున్న రెండు రోజులు కూడా సెలవు దినాలు కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా త్వరలో బ్రేకీవెన్ సాధించి.. నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టనుందని సమాచారం.