మాదాల రంగారావు మనవడు హీరోగా.. పలు విప్లవ చిత్రాలతో మెప్పించారు నటుడు, దర్శకనిర్మాత మాదాల రంగారావు. ఆయన కొడుకు మాదాల రవి కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. ఇప్పుడు రంగారావు మనవడు సన్నీ హీరోగా ‘ఓ టార్చర్ ప్రేమ’ అనే సినిమా వస్తోంది. మౌనిక డాకోజు హీరోయిన్.
ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘తాత, తండ్రి మార్గం విప్లవం అయితే, సన్నీ మాత్రం ప్రేమ మార్గం ఎంచుకున్నాడు. శ్రీకర్ కృష్ణ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
The first look title poster of #Ootortureprema
— Srikaram productions (@Srikarampro) February 4, 2026
Written & Directed by @actorsrikar
Introducing @madala_sunny , @MounikaDakoju7
A @itsishaqvali musical 🎶 #torturebeginssoon pic.twitter.com/UIwQ9XfXyf
దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక చక్కని ప్రేమకథా చిత్రం. ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. షూటింగ్ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’ అని చెప్పారు. రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, నాగి ఇతర పాత్రలు పోషిస్తున్నారు
First look title poster launched by Dr. Paruchuri Gopalakrishna garu @actorsrikar @madala_sunny @MounikaDakoju7 #Ootortureprema #torturebeginssoon pic.twitter.com/RTqsVxfCgS
— Srikaram productions (@Srikarampro) February 4, 2026
