సాధారణంగా అందరూ ఫుడ్‌ని వేడిగా ఉన్నప్పుడు తినడానికే ఇష్టపడతారు. అందుకే గిన్నెలను స్టవ్ మీది నుంచి తీసుకొచ్చి నేరుగా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంటారు. కానీ.. చాలావరకు టేబుల్స్ ఆ వేడిని తట్టుకోలేవు. దాంతో తొందరగా పాడవుతుంటాయి. అందుకే వేడి గిన్నెలను ఇలాంటి సిలికాన్ మ్యాట్స్‌పై పెట్టుకోవాలి.
వీటిని మహర్ష్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇవి -40 డిగ్రీల సెంటిగ్రేడ్స్ నుంచి 230 డిగ్రీల సెంటిగ్రేడ్స్ వరకు వేడిని తట్టుకోగలవు. టేబుల్‌పై ఈ మ్యాట్ వేసి, దానిపై ఎలాంటి వేడి గిన్నెలనైనా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా హాట్ పాట్స్, పాన్స్, ఓవెన్ ట్రేలకు ఇవి బాగా సరిపోతాయి. గ్రిప్ కోసం వీటిని హనీ కోంబ్ డిజైన్‌తో తయారుచేశారు.
►ALSO READ | స్పాటిఫైలో సూపర్ ఫీచర్.. సాంగ్ ట్రాన్స్లేషన్ తో భాష తెలియకపోయినా...
