హైదరాబాద్లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీకి దగ్గర్లో ఉన్న ఫ్రూట్స్ స్టాల్, మటన్ దుకాణం, స్క్రాప్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో నాలుగు షాపులు పూర్తిగా కాలిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడతామన్నారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.