Karthika Deepam 2: కార్తీకదీపం సీరియల్కు సీక్వెల్.. ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావా!

Karthika Deepam 2: కార్తీకదీపం సీరియల్కు సీక్వెల్.. ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావా!

తెలుగు ఆడియన్స్ కు కార్తీక దీపం(Karthika Deepam) సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. తెలుగు సీరియల్స్ చరిత్రలోనే ఈ కార్తీక దీపం ఒక రికార్డ్. నటులు నిరుపమ్(Nirupam), ప్రేమ విశ్వనాథ్(Prema Vishwanath), శోభా శెట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సీరియల్ తెలుగు ఆడపడుచులను విపరీతంగా ఆకట్టుకుంది. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ కథాంశంతో వచ్చిన ఈ సీరియల్ దాదాపు ఆరేళ్ళు పాటు 1569 ఎపిసోడ్స్ తో సాగి తెలుగు టీవీ చరిత్రలో టాప్ టిఆర్పిలను సొంతం చేసుకున్న ఈ సీరియల్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

అయితే అంతలా ప్రేక్షకాదరణ పొందిన ఈ సీరియల్ ముగిసిపోవడం చాలామంది ఆడియన్స్ ను బాధ పెట్టింది. ఇంకా ఉండే బావుండు కదా అనుకున్నారు. ఇప్పటికి చాలా మంది ఈ సీరియల్ రే టెలికాస్ట్ చేస్తే చూడటానికి సిదంగా ఉన్నారు. దీంతో.. కార్తీక దీపం సీరియల్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను అర్థం చేసుకున్న మేకర్స్ రీ టెలికాస్ట్ కాకుండా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.

కార్తీకదీపం–ఇది నవ వసంతం అనే టైటిల్ తో ఈ సీక్వెల్ ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కార్తీక దీపం రిలీజ్ విషయంలో కూడా సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. సినిమాల రేంజ్ లో సి సీరియల్ కు  ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో మార్చి 21న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్ లో సీరియల్ నటీనటులు నిరుపమ్, ప్రేమ విశ్వనాథ్ సహా కాస్ట్ మొత్తం పాల్గొననున్నారు. అంతేకాదు మొదటి షో ప్రీమియర్ కూడా ఇదే ఈవెంట్ లో వేయబోతున్నారని సమాచారం. బ్లాక్ బస్టర్ సీరియల్ కి సీక్వెల్ గా వస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.