Prasanth Varma: హనుమాన్ అవార్డుల వేట మొదలు.. ఐకాన్ అవార్డ్స్ బెస్ట్ డైరెక్టర్

Prasanth Varma: హనుమాన్ అవార్డుల వేట మొదలు.. ఐకాన్ అవార్డ్స్ బెస్ట్ డైరెక్టర్

థియేటర్స్ లో హనుమాన్(HanuMan) సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. అసలు ఏమాత్రం అంచనాలు, స్టార్ కాస్ట్ లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. 2024 జనవరి సంక్రాంతి భరిలో స్టార్ హీరోల మధ్య పోటీకి దిగిన హనుమాన్ సినిమా వార్ వన్ సైడ్ చేసేసింది. ప్రేక్షకులు సినిమాకు రావాలంటే ఉండాల్సింది స్టార్స్ కాదు.. కంటెంట్ అని మరోసారి ప్రూవ్ చేసింది హనుమాన్. తెలుగులో వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమా కావడం, దానికి ఇండియన్ మైథాలజీని లింకప్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అందుకుగాను విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. 

కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లాగ్ రన్ లో ఏకంగా రూ.330 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో సినిమాలో చూపించిన విజువల్స్ కి ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు. మరీ ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో హనుమంతులవారిని చూపించిన విధానం ఆడియన్స్ ను గూస్బంప్స్ తెప్పించింది. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. అందుకే ఆయన తరువాతి సినిమాలపై ఇప్పటినుండి భారీ బజ్ క్రియేట్ అవుతోంది. 

ఇక థియేటర్స్ వండర్స్ క్రియేట్ చేసిన హనుమాన్.. ఇప్పుడు అవార్డుల వేటను కూడా మొదలుపెట్టింది. తాజాగా హనుమాన్ సినిమాకుక్ గాను బెస్ట్ డైరెక్టర్ గా మొదటి అవార్డు అందుకున్నాడు ప్రశాంత్ వర్మ. రేడియో సిటీ తెలుగు నిర్వహించిన ఐకాన్ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ అవార్డు అందుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ ఆయననకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే ఈ సినిమాకి ఇంకా చాలా గొప్ప గొప్ప అవార్డులు వరిస్తాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.