Venkatesh,Anil Ravipudi: సంక్రాంతికి వస్తున్నాంతో మళ్ళీ సంక్రాంతికే వస్తున్న వెంకటేష్

Venkatesh,Anil Ravipudi: సంక్రాంతికి వస్తున్నాంతో మళ్ళీ సంక్రాంతికే వస్తున్న వెంకటేష్

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) మళ్ళీ సంక్రాంతికి సిద్దమవుతున్నాడు. తనకు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడితో తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నాడు. ఇటీవలే సైంధవ్ సినిమాతో సంక్రాంతి భరిలో దిగిన వెంకటేష్ మళ్ళీ నెక్స్ట్ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఇక F2, F 3 వంటి సూపర్ హిట్ కాంబోలో రానున్న ఈ సినిమాకు కూడా అదే లెవల్లో ఉండేలా సరికొత్త టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇంతకీసలు విషయం ఏంటంటే.. ఇటీవలే సైంధవ్ వంటి యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్.. ఆ సినిమాతో అభుమానులను అలరించలేకపోయాడు. చాలా కాలం తరువాత వెంకటేష్ యాక్షన్ మోడ్ లో కనిపించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో వెంకటేష్ తరువాతి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే వెంకీమామ తన తరువాతి సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడితో  చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ కాంబోపై అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఈ సినిమాకు కోసం విచిత్రమైన టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

హీరో వెంకటేష్ కు సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. అందుకే 2025 సంక్రాంతి రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు కూడా సంక్రాంతి సెంటిమెంట్ కలిసొచ్చేలా సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వెంకటేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి సంక్రాంతి టైటిల్ తో సంక్రాంతి వస్తున్న వెంకటేష్ ఎలాంటి రిజల్ట్ ను అందుంటాడో చూడాలి.