
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్(Ranveer singh), దీపికా పదుకొనె(Deepika Padukone) తమ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ జంట తమ మొదటి బేబీకి వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ప్రెగ్నెన్సీని అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయంపై కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు దీపిక.
చిన్నారి దుస్తులతో, చెప్పులతో, బొమ్మలతో డిజైన్ చేసిన ఓ పోస్టర్ ని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ జంట. అంతేకాదు.. ఫస్ట్ చైల్డ్ వచ్చే టైమ్‌ని కూడా వెల్లడించారు. సెప్టెంబర్‌లో తమ మొదటి బిడ్డ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం దీపికా, రణ్‌వీర్ షేర్ చేసిన ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతునాయి. ఈ న్యూస్ చూసిన వారి అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.