Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ టీమ్ నుంచి అందుకే తప్పుకున్నా.. 

Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ టీమ్ నుంచి అందుకే తప్పుకున్నా.. 

Sanju Samson: మరో 11 రోజుల్లో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఈసారి మరింత ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఈ సీజన్ నుంచి టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్  ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున బరిలోకి దిగబోతున్నాడు. అతడు గత ఏడాది ట్రేడ్ డీల్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై గూటికి చేరిన వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ట్రేడ్ క్రికెట్ అభిమానులని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

2018 నుంచి 2025 వరకు రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి సంజు ప్రాతినిధ్యం వహించాడు.  తాజాగా, ఈ ట్రేడ్ డీల్ పై ఎట్టకేలకు సంజు శాంసన్ నోరు విప్పాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో తన సమయం ముగిసిందని తాను భావించడం వల్లే బయటకు రావాల్సి వచ్చిందని చెప్పాడు. నేను రాజస్థాన్ కి ప్రత్యర్థిగా ఆడటం ఇదే తొలిసారి.. ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు నాకు రాలేదని పేర్కొన్నాడు. అయితే నేను ఒక్కసారి స్టేడియంలోకి వచ్చాక మ్యాచ్ గురించి తప్ప ఇంకేమీ ఆలోచించే ప్రసక్తి లేదని శాంసన్ అన్నాడు.

ALSO READ : తిలక్ వర్మకు సీఎం రేవంత్ సత్కారం

రాజస్థాన్ రాయల్స్ జట్టులో చాలా మంది ప్లేయర్స్ తో కలిసి నేను ఆడాను అని సంజు శాంసన్ వెల్లడించారు. మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్ అంతా తెలిసినవాళ్లే.. వారి ప్రేమ, గౌరవ భావం కలిగిన వ్యక్తులు.. కానీ ప్రతి ఒక్కరికీ ఒక సమయం అనేది కచ్చితంగా వస్తుంది.. రాజస్థాన్ టీమ్ తో నా సమయం ముగిసింది.. నేను ఇంకా ముందుకు సాగాను.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో నాకు కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాను.. ప్రస్తుతం నేను రాజస్థాన్ రాయల్స్ పై కూడా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను అని సంజు శాంసన్ పేర్కొన్నారు.