తిలక్ వర్మకు సీఎం రేవంత్ సత్కారం

తిలక్ వర్మకు సీఎం రేవంత్ సత్కారం

హైదరాబాద్‌‌, వెలుగు: టీ20 వరల్డ్ కప్‌‌ విన్నింగ్ టీమ్ మెంబర్‌‌‌‌ హైదరాబాదీ తిలక్‌‌ వర్మను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత సిటీకి తిరిగొచ్చిన తిలక్ సోమవారం రాత్రి జూబ్లీహిల్స్‌‌ నివాసంలో సీఎంను  మర్యాదపూర్వకంగా కలిశాడు.

ఈ సందర్భంగా తిలక్‌‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్,  ఎంపీ వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి పాల్గొన్నారు.