ఇటీవల విజయ్ దేవరకొండను వివాహమాడిన రష్మిక మందన్నా ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. తను కమిట్ అయిన చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తిచేసే పనిలో ఉంది. తాజాగా ఆమె లీడ్ రోల్‌లో రూపొందుతున్న ఫిమేల్ -సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మైసా’ సెట్‌లో జాయిన్ అయ్యింది. ‘ది హంట్ బిగిన్స్’ అంటూ ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రష్మిక.
ఇందులో గోండు గిరిజన తెగకు చెందిన పవర్‌ఫుల్ ఉమెన్‌గా ఆమె కనిపించనుంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్‌లో రష్మిక క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు మేకర్స్. ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.
