‘లెనిన్’ (LENIN) మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ రూరల్ యక్షన్ డ్రామా రేపు (జులై 10న) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ చిత్రానికి ఒక రోజు ముందుగా ప్రీమియర్ షోలు ఉండవని ఇప్పటికే నిర్మాత నాగవంశీ కూడా స్పష్టం చేయడంతో ఆడియన్స్కు ఓ క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇండియాలో పలుచోట్ల ఉదయం 5 గంటల నుంచే షోస్ పడనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం మార్నింగ్ షోలు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఓవర్సీస్ ప్రీమియర్స్ భారత కాలమానం ప్రకారం ఉదయం 4:30 గంటలకు ప్రదర్శించనున్నట్లు నిర్మాత వెల్లడించారు.
A world you have been waiting to step into...
— Sithara Entertainments (@SitharaEnts) July 8, 2026
A story you will carry back with you. ❤️🔥#LENIN in theatres from JULY 10.
Shows begin at
India - 5:00 AM IST
Overseas - 4:30 AM IST
🎫 https://t.co/tGt4vngxn7#LeninOnJuly10th pic.twitter.com/tIqptHJR4L
అఖిల్ తన గత చిత్రాలతో పాటుగా చివరగా ‘ఏజెంట్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత ‘లెనిన్’వస్తుండటంతో.. అంచనాలతో పాటు సందేహాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే సినీ ఫ్యాన్స్ ‘లెనిన్’ హిట్ అవ్వాలంటే.. ఎంత రాబట్టలనే లెక్కలపై చర్చించుకుంటున్నారు. మరి ఇంతకీ లెనిన్ బడ్జెట్ ఎంత? థియేట్రికల్ బిజినెస్ చేసింది? బ్రేక్ ఈవెన్ ఎన్ని కోట్లు రాబట్టాలి? అనేది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
‘లెనిన్’ బడ్జెట్..
టాలీవుడ్ టాప్ బ్యానర్స్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జునల నిర్మాణంలో ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. అఖిల్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది కావడంతో, ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల బడ్జెట్తో నిర్మించారని సమాచారం. ముఖ్యంగా ఇందులో టాలెంటెడ్ యాక్లర్లు, టెక్నిషియన్స్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కాస్ట్ అంతా కలిపి ఈ మొత్తం అయినట్లుగా సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.
‘లెనిన్’ బిజినెస్..
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘లెనిన్’ విడుదలకు ముందే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఇండియా వైడ్ థియేట్రికల్ హక్కుల ద్వారా సుమారు రూ.32 కోట్ల మేరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.
Also Read ; నేషనల్ క్రష్ రిస్కీ స్టంట్.. 'మైసా' కోసం రష్మిక అండర్ వాటర్ సాహసం..!
తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 22–23 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు టాక్. ఈ నేపథ్యంలో లెనిన్ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా రూ.25 కోట్లకి పైగా షేర్, 50 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ టార్గెట్ రీచ్ అవ్వడం పెద్ద కష్టం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
The love for #LENIN...
— Sithara Entertainments (@SitharaEnts) July 9, 2026
Is already leading the way ❤️🔥
Trending #1 on @bookmyshow with bookings open 💥💥
GRAND RELEASE TOMORROW 🔥
🎟️ - https://t.co/tGt4vngxn7#LeninOnJuly10th @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman @pramodactor1… pic.twitter.com/oxTTz3T57L
రాష్ట్రాల వారిగా బిజినెస్..
ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం,
నైజాం హక్కులు సుమారు రూ.8.5 కోట్లు,
ఆంధ్ర ప్రాంతం రూ.9 కోట్లు,
సీడెడ్ రూ.4 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 22–23 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
కర్ణాటక రైట్స్ సుమారుగా 8 కోట్ల రూపాయలు కాగా, ఇతర రాష్ట్రాల్లో కలిపి 2 కోట్ల రూపాయలు అమ్ముడుపోయాయని సమాచారం. ఇతర రాష్ట్రాల హక్కులతో కలిపి మొత్తం ఇండియా వైడ్ థియేట్రికల్ బిజినెస్ రూ.32 కోట్లకు చేరువైనట్లు సినీ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ బిజినెస్ లెక్కలపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఓవర్సీస్‌లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ వాల్యూ సుమారుగా రూ.10 కోట్లు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా ఇండియా మొత్తంలో రూ.35 కోట్లు షేర్, వరల్డ్ వైడ్‌గా రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తే.. ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక శాటిలైట్ హక్కులను జీ తెలుగు, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ZEE5 దక్కించుకున్నట్లు సమాచారం. ఆడియో, శాటిలైట్, ఓటీటీ హక్కుల ద్వారా సినిమా విడుదలకు ముందే నిర్మాతలు బడ్జెట్‌లో దాదాపు 30 శాతం వరకు రికవరీ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
