హైదరాబాదులో తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. బుధవారం రేట్లు ఇవే..

హైదరాబాదులో తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. బుధవారం రేట్లు ఇవే..

నిన్న కొద్దిగా పెరిగిన బంగారం రేట్లు నేడు తిరిగి తిరోగమనం దిశగా పయనిస్తున్నాయి. యుద్ధం మూడో వారంలోకి ఎంట్రీ ఇవ్వటంతో విలువైన లోహాలకు గిరాకీ మరింతగా తగ్గుతోంది. ఇన్వెస్టర్లు గోల్డ్ అండ్ సిల్వర్ కాదంటూ క్రిప్టోలను ఎంచుకోవటం కూడా ర్యాలీకి బ్రేక్స్ వేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు షాపింగ్ చేయటానికి వెళ్లాలని భావిస్తున్నట్లయితే తగ్గిన రేట్లను తెలుసుకోండి. 

మార్చి 18న బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. మార్చి 17 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.33 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 775గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 460గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : ఈ కారుకు ఒక్కసారి చార్జ్ చేస్తే 567 కిలోమీటర్లు జర్నీ చేయొచ్చు.. రేటెంతంటే..

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మార్చి 18, 2026న దేశవ్యాప్తంగా రూ.10వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 75వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.275 వద్ద ఉంది.