బీవైడీ ఇండియా తన ఎలక్ట్రిక్ కారు సీలయన్ 7 మొదటి యానివర్సరీ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.49 లక్షల నుంచి రూ.54 లక్షల వరకు ఉంటాయి.
ఒక్కసారి చార్జ్ చేస్తే 567 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రీమియం ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ ఈ కారు ప్రత్యేకత. ఇది 82 కిలోవాట్ అవర్ల బ్యాటరీతో వస్తుంది. సెక్యూరిటీ కోసం తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, ఏడీఏఎస్ లెవల్ 2, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటాయి.
