హ్యాపీ రాజ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ 

హ్యాపీ రాజ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ 

మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా బిజీగా ఉంటూనే హీరోగానూ వరుస సినిమాలు చేస్తున్నాడు జీవీ ప్రకాష్ కుమార్. తను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హ్యాపీ రాజ్’. శ్రీగౌరీ ప్రియ హీరోయిన్‌‌‌‌. మరియా రాజా ఎలాంచెజియన్ దర్శకత్వంలో  బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  జైవర్ద నిర్మించారు.  మ్యూజికల్ ప్రమోషన్స్‌‌‌‌లో భాగంగా మంగళవారం మొదటి పాటను విడుదల చేశారు. జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన మాస్ బీట్‌‌‌‌కు రెహమాన్ క్యాచీ  లిరిక్స్ అందించాడు.  

గోవింద్ ప్రసాద్ పాడాడు.  ‘అద్దిరా లెక్క..నువ్వేమి చేశావో ఏమో మరి.. ఎదలో తుఫాను మొదలయేలే.. నువ్వొచ్చి రాగానే నా లైఫ్‌‌‌‌లో  థౌజండ్ లైట్స్  వెలిగాయిలే.. ఓ బేబీ.. నేనే నీవాడిని.. నీ ఈడుజోడుని.. ’ అంటూ సాగిన  పాటలో జీవీ ప్రకాష్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌‌‌‌ మూమెంట్స్‌‌‌‌తో ఇంప్రెస్ చేశాడు.  

అబ్బాస్, జార్జ్ మరియన్, గీతా కైలాసం,  అదుర్చి అరుణ్, మధురై ముత్తు ఇతర పాత్రలు పోషించిన ఈ  చిత్రం  మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్  ఎల్ఎల్పీ ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతోంది.