ఇతర భాషల్లోనూ వనజీవి బయోపిక్

ఇతర భాషల్లోనూ వనజీవి బయోపిక్

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘కోటి మొక్కల రామయ్య’గా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ ఆధారంగా రూపొందిన షార్ట్ ఫిల్మ్ ‘వనజీవి రామయ్య’.  బ్రహ్మాజీ, నాగరాణి,  నాగమల్ల మహేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి  వేముగంటి దర్శకత్వం వహించగా, నిదిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, భూషం రవీంద్రనాథ్, లింగంపల్లి చంద్రశేఖర్ నిర్మించారు. 

ఈ  బయోపిక్‌‌‌‌  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డుల్లో బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ విభాగంలో ఎంపికైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మంగళవారం ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించింది.  

రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌‌‌‌పర్సన్ వెన్నెల, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, రాజ‌‌‌‌కీయ విశ్లేష‌‌‌‌కులు వి. ప్రకాష్, తన్నేరు బాబురావు,  తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరై చిత్రాన్ని అభినందించారు.  ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో కూడా విడుదల చేయనున్నట్టు ఈ సందర్భంగా టీమ్ తెలియజేసింది.